ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weddings: పెళ్లిళ్ల జోరు.. అభ్యర్థుల బేజారు.. ఓటింగ్‌ రోజున ఊళ్లకు వెళ్తే...

ABN, First Publish Date - 2023-11-15T09:46:27+05:30

ఎన్నికల వేళ పెళ్లిళ్ల జోరు రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. కార్తీక మాసం పెళ్లిళ్లకు అనువైనదిగా పండితులు పేర్కొంటున్నారు.

అల్వాల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ పెళ్లిళ్ల జోరు రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. కార్తీక మాసం పెళ్లిళ్లకు అనువైనదిగా పండితులు పేర్కొంటున్నారు. ఈ నెల 16, 19, 21, 22, 23, 24, 26, 29 ఆ తర్వాత డిసెంబర్‌ నెల ముగింపులో ముంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆయా తేదీల్లో జంట నగరాల్లో 50 వేల నుంచి లక్షకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అంచనా. ఈ నెల 30 శాసనసభ ఎన్నికల పోలింగ్‌. అంటే పోలింగ్‌కు 10 రోజుల ముందు నుంచే పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. అభ్యర్థుల ప్రచారం, పెళ్లిళ్లు ఒకేసారి జరగనుండటంతో మండపాల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సందడి చేయనున్నారు. ఇంతకు ముందు ప్రజాప్రతినిథుల ఇళ్లకు వెళ్లి పత్రికలు ఇచ్చి పెళ్లికి రావాలని పదేపదే కోరినా హాజరయ్యే పరిస్థితి పెద్దగా ఉండేది కాదు. ప్రస్తుతం ఎన్నికలు కావడంతో ఆహ్వానించకున్నా అభ్యర్థులు పెళ్లి మండపాల్లో వాలిపోనున్నారు. ఈ నెల 29న జరిగే పెళ్లిళ్లు ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే.. వివాహాలకు దూరపు ప్రాంతాలకు వెళ్లేవారిని రప్పించడం ఎలా అన్నది అభ్యర్థులకు ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లయిన మర్నాడే వారిని రప్పిస్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో వారిపై దృష్టి సారించి ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా ద్వితీయ శ్రేణి నాయకులకు పోటీలో ఉన్న అభ్యర్థులు సూచిస్తున్నారు. ఎవరెక్కడికి వెళ్లినా ఓటింగ్‌ రోజు తప్పని సరిగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని పురమాయిస్తున్నారు.

Updated Date - 2023-11-15T09:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising