ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medico Preethi: కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2023-03-06T16:58:57+05:30

సీఎం కేసీఆర్‌ (CM KCR) పాలనలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ద్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR) పాలనలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ద్వజమెత్తారు. మెడికో ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని విమర్శించారు. ప్రీతి (Preethi) సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ చేశారని, ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటివరకూ క్లారిటీ లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి కేసీఆర్‌కు అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ (Telangana) సాధన లక్ష్యం నెరవేరాలన్నా.. నేరాలు అదుపులోకి రావాలన్నా బీజేపీ (BJP)తోనే సాధ్యమని సంజయ్‌ స్పష్టం చేశారు.

పోలీసులకు సవాల్‌గా మారిన ప్రీతి కేసు

ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్‌ అనే మత్తు ఇంజెక్షన్‌ వయల్స్‌ పడి ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శరీరంలో ఆ మందుల అవశేషాలతో పాటు, వేరేవైనా విషాలు ఉన్నాయా తెలుసుకునేందుకు హైదరాబాద్‌ డాక్టర్లు నమూనాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. పదిరోజుల తర్వాత.. ఆ నివేదిక ఆదివారం వరంగల్‌ పోలీసులకు చేరింది. ప్రీతి శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రసాయనాలూ కనిపించలేదని ఆ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎలాంటి నిర్ధారణకూ రాలేని పరిస్థితి. ఆమె తల్లిదండ్రులేమో.. తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-03-06T16:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising