ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: యాదాద్రిలో నేత్రపర్వంగా తెప్పోత్సవం

ABN, First Publish Date - 2023-04-06T20:52:24+05:30

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధిలో గురువారం చైత్ర పౌర్ణమి వేడుకలు, తెప్పోత్సవం (Theppotsavam) వైభవంగా కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధిలో గురువారం చైత్ర పౌర్ణమి వేడుకలు, తెప్పోత్సవం (Theppotsavam) వైభవంగా కొనసాగాయి. సాయంత్రం వేళ ప్రధానాలయంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు సేవలో తీర్చిదిద్దారు. లక్ష్మీనృసింహుల అలంకార సేవను ఆలయ తిరువీధుల గుండా వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ విష్ణుపుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేశారు. దేవస్థాన అర్చకబృందం, వేదపండితులు దేవతల సేనాధిపతి విశ్వక్సేనుడిని ఆరాధిస్తూ ఉత్సవమూర్తులను కొలిచి విష్ణుపుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయ నారసింహ, నమో నారసింహ నామస్మరణల నడుమ తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.

ఉద్ఘాటన అనంతరం తొలిసారి

యాదగిరీశుడి సన్నిధిలో ప్రతీ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున విష్ణుపుష్కరిణిలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి తెప్పపై అధిష్ఠింపజేసి జలవిహారం నిర్వహించడం ఆలయ సంప్రదాయం. అయితే గత ఆరేళ్లుగా ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా తెప్పోత్సవాలను తాత్కాలిక బాలాలయంలోనే నిర్వహించారు. గతేడాది మార్చి 28న ఆలయ ఉద్ఘాటన జరగడంతో నాటి నుంచి స్వామి సన్నిధిలో వేడుకలన్నీ యథావిధిగా అర్చకబృందం నిర్వహిస్తున్నారు.

శోభాయమానంగా చైత్ర పౌర్ణమి వేడుకలు

చైత్ర పౌర్ణమి వేడుకలు శోభాయమానంగా కొనసాగాయి. ప్రతీ సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున తెప్పోత్సవం నిర్వహించడం సంప్రదాయం. పౌర్ణమి రోజున నిండు చంద్రుడి వెలుగుల నడుమ కొండపైన విష్ణుపుష్కరిణిలో తెప్పపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్లు విహరించి భక్తులను కటాక్షించారు.

Updated Date - 2023-04-06T20:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising