ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP JAC: మేము జగన్‌పై ఉద్యమానికి వెళ్తున్నాం

ABN, First Publish Date - 2023-02-28T20:08:28+05:30

ఇటీవల ఫిబ్రవరి 5వ తేదీన కర్నూలు ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి రాష్ట్ర మహాసభ సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి (AP CS Jawahar Reddy) 50 పేజీలతో కూడిన మొమోరాండాన్ని ఇచ్చామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఇటీవల ఫిబ్రవరి 5వ తేదీన కర్నూలు ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి రాష్ట్ర మహాసభ సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి (AP CS Jawahar Reddy) 50 పేజీలతో కూడిన మొమోరాండాన్ని ఇచ్చామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ చెప్పారు. ఉద్యోగుల రావాల్సిన ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలు కొన్నింటిని వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ వివరాలు ఇలా ఉన్నాయి.మార్చి 9, 10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసనలు, 15, 17, 20 తేదీల్లో జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు, 21 నుంచి వర్క్‌టూ రూల్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు. మార్చ్ 21న సెల్‌డౌన్‌, యాప్‌డౌన్, 24 నుంచి అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ధర్నాలు, 27న కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పు కార్యక్రమం ఉంటుందని జేఏసీ నేతలు తెలిపారు.

సరెండర్ లీవ్‌లు, ఎర్న లీవ్‌లు, జీపీఎఫ్‌ల విషయంలో ఏప్రిల్‌ 1న పోలీసు కుటుంబాల ఇళ్ళకు తిరుగుతామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు. కలెక్టరేట్‌లకు వెళ్ళి గ్రీవెన్స్ నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 5న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు పేర్కొన్నారు. కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వలేదని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రభుత్వం నుంచి పాల వాడి దాకా ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని బొప్పరాజు మండిపడ్డారు. 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు పెంపును ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు అమలు చేయడం లేదని బొప్పరాజు ఆరోపించారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఉద్యమ కార్యచరణపై ఆలోచిస్తామని, ఈసారి చాయ్ బిస్కెట్స్ సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని బొప్పరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-29T15:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising