ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా పాలనకు 100 రోజులు

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:36 AM

అగాఽథంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే, సామాన్యులు, బాధితులకు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం తొలి వంద రోజుల్లో గట్టి ప్రయత్నం చేసింది.

కోటి ఆశలు.. కొండంత భరోసా

ఏపీకి తిరిగి ఊపిరి పోసిన కూటమి పాలన

ఐదేళ్ల వైసీపీ అరాచకం నుంచి

రూ.5కే కడుపు నింపే స్థితికి

రాష్ట్రమంతా తెరుచుకున్న అన్న క్యాంటీన్లు

వృద్ధులకు వెయ్యి పెంచి రూ.4 వేల పింఛను

ఉద్యోగులకు ఒకటో తారీఖునే వేతనాలు

కేంద్రం స్నేహంతో ప్రగతికి దారులు

పోలవరం, అమరావతిలో తిరిగి కదలిక

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అగాఽథంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే, సామాన్యులు, బాధితులకు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం తొలి వంద రోజుల్లో గట్టి ప్రయత్నం చేసింది. ఎన్డీయే కూటమి భాగస్వామిగా కేంద్రంలో పొందిన పలుకుబడితో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాజధాని వంటి కొన్ని కీలక కార్యక్రమాలు పూర్తి కాగలవన్న నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కలిగించగలిగింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు కళ్లెం వేసి ప్రజలు శాంతిని ఆస్వాదించే వాతావరణాన్ని కలిగించడంలో కూడా ప్రభుత్వం విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం గురువారానికి వందరోజుల పాలనను పూర్తి చేసుకొంటోంది. వంద రోజుల కాలం స్వల్ప వ్యవధే అయినా కొన్ని ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ఈ కొద్దిరోజుల్లోనే ఈ ప్రభుత్వం చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల పింఛన్లు రూ. వెయ్యి పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకొంది.

మొత్తం ప్రభుత్వ ఆదాయాన్ని, వనరులను ఈ పఽథకాలకే వినియోగిస్తున్నట్లు ప్రచారం చేసుకొంది. కానీ, పేదల పింఛన్లను ఏడాదికి కేవలం రూ. 250 మాత్రమే పెంచగలిగింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళంలో ఉంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అయినా సాహసం చేసి మొదటి నెలలోనే ఆ పింఛన్లను ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ. నాలుగు వేలు చేశారు. పైగా మూడు నెలల బకాయి కలిపి పేదలకు రూ. ఏడు వేలు ఒకేసారి ఇచ్చారు. ఆ వర్గాల వారికి ఇంత డబ్బు చేతికి అందడం ఇదే ప్రఽథమం. మరీ తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పింఛను ఏకంగా రూ. పది వేలు చేశారు. ఇతర దివ్యాంగులకు కూడా పెంచారు. ఈ పింఛన్లను కూడా ప్రతి నెలా మొదటి తేదీనే పేదల చేతికి ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలాకాలం తర్వాత మొదటి తేదీనే జీతాలు అందడం మొద లైంది. వైసీపీ హయాంలో మొదటి రెండు వారాల్లో ఏ రోజున జీతం చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. అధికారంలోకి వచ్చిన రెండో నెలలో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునర్‌ ప్రారంభించడం సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు నింపింది.


అమరావతి, పోలవరాలకు ఊపిరి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రతిష్ఠాత్మక అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఊపిరి పోయగలిగింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగడానికి ఈసారి టీడీపీ ఎంపీల సంఖ్యాబలం ఉపయోగపడటంతో దానిని సద్వినియోగం చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా కేంద్రం తన కోటాలో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకొని రూ.పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి అందివ్వడానికి ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడానికి రూ. పన్నెండు వేల కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించింది. ఇది పూర్తయితే రెండో దశకు కేంద్రం ఏ మేరకు సాయం ఇస్తుందన్నది స్పష్టత వస్తుంది.

వరదల్లో బాధితులకు భరోసా

విజయవాడ వరదల్లో చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు గట్టి ఆసరాగా నిలిచింది. సంక్షోభాల్లో రెట్టింపు శక్తితో పనిచేసే చంద్రబాబు ఈ వరదల్లో సర్వం తానై పనిచేశారు. రాష్ట్ర సచివాలయాన్ని విజయవాడ నగరానికి మార్చేశారు. మంత్రులు, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను కూడా కింది స్థాయికి పంపి పనిచేయించారు. తాను పది రోజులు బస్సులోనే పడుకొని పనిచేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన శ్రమ రాష్ట్రం లోపలా... బయటా అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందింది.

Updated Date - Sep 19 , 2024 | 07:37 AM

Advertising
Advertising