ఉద్యోగుల విరాళం 120 కోట్లు
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:46 AM
వరద బాధితులకు ఉద్యోగులు రూ.120కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబరు నెల జీతం నుంచి ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తునట్లు ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒకరోజు బేసిక్ పే సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఒకరోజు జీతం ప్రకటించిన ఏపీ జేఏసీ, ఎపీ ఎన్జీవో నేతలు
ఏపీ సచివాలయ సంఘం కూడా... సీఎం ధన్యవాదాలు
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వరద బాధితులకు ఉద్యోగులు రూ.120కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబరు నెల జీతం నుంచి ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తునట్లు ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒకరోజు బేసిక్ పే సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, సెక్రటరీ జనరల్ హృదయరాజు, ఏపీ యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,. ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ విద్యాసాగర్, ఎన్జీవో సంఘం నాయకుడు జగదీశ్, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రభుదాస్, పీఏవో ఉద్యోగుల అధ్యక్షుడు హరినాథ్‌బాబు, గ్రామ సచివాలయ సంఘం అధ్యక్షుడు జానీ బాషా, ఇతర సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కలసి అంగీకార పత్రాన్ని అందజేశారు. అలాగే ఏపీ సచివాలయ సంఘం నాయకులు సీఎంను కలిసి ఒకరోజు మూల వేతనాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా అందజేశారు. పెద్దఎత్తున విరాళాలు అందించిన దాతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక, రిత్విక్ ప్రాజెక్ట్స్ తరఫున రూ.కోటి విరాళాన్ని అందించనున్నట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. బీఎ్‌సఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ.కోటి, సినీ నిర్మాత అశ్వనీదత్ రూ.25లక్షలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఏపీ) రూ.25లక్షలు, నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25లక్షలు, కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటీవ్ సొసైటీ రూ.25లక్షలు, ఎల్‌వీఆర్ అండ్ సన్స్ క్లబ్ రీడింగ్ కమిటీ రూ.25లక్షలు, చుక్కపల్లి రమేష్ రూ.25లక్షలు, ఏపీ పౌల్ర్టీ అసోసియేషన్ రూ.25లక్షలు, గుంటూరు క్లబ్ రూ.10లక్షలు, తెనాలి డబుల్ హార్స్ రూ.10లక్షలు, ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ రూ.5లక్షలు, సిద్ధార్థ వాకర్స్ క్లబ్ (విజయవాడ) రూ.5లక్షలు, టీడీపీ మహిళా నేత రాయపాటి శైలజ (గుంటూరు) రూ.5లక్షలు, చిలకమర్రి శ్రీనివాసాచార్యులు రూ.లక్షన్నరతో పాటు పలువురు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు. మంత్రి సవిత కుమారుడు జగదీశ్ సాయి తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.21వేలు విరాళంగా అందించారు. గుంటూరు లోటస్ ఇన్‌ఫ్రా ప్రతినిధులు రూ.10 లక్షలు, ఏలూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ వినయ్‌కుమార్, గోళ్లమూడికి చెందిన పవన్‌కుమార్ రూ.10లక్షలు చొప్పున, సిటీకేబుల్ ఎండీ సాయి రూ.5లక్షలు విజయవాడలో మంత్రి నారా లోకేశ్‌కు అందజేశారు.
Updated Date - Sep 05 , 2024 | 07:27 AM