‘అమృత’ అమలుకు రూ.27.43 లక్షలు
ABN, Publish Date - Oct 01 , 2024 | 12:10 AM
కర్నూలు నగరానికి తాగునీటి సరఫరాలో భాగంగా అమృత పథకం అమలు కోసం రూ.27.43 లక్షలు మంజూరు చేస్తూ సోమవారం ఏపీ అర్బన ఫైనాన్స అండ్ ఇనఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన లిమిటెడ్ ఎండీ ఎం.హరినారయణ ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరానికి తాగునీటి సరఫరాలో భాగంగా అమృత పథకం అమలు కోసం రూ.27.43 లక్షలు మంజూరు చేస్తూ సోమవారం ఏపీ అర్బన ఫైనాన్స అండ్ ఇనఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన లిమిటెడ్ ఎండీ ఎం.హరినారయణ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నగర ప్రజలు తాగునీటి సరఫరా కోసం సుంకేసుల బ్యారేజీ నుంచి పైపులైన, సుంకేసుల వద్ద హెడ్ పంప్‌హౌస్ తదితర పనులు చేపట్టారు. ఇందుకోసం అమృత పథకం కింద రూ.82 కోట్లు మంజూరు చేశారు. రూ.77.90 కోట్లతో పనులు చేపట్టారు. పైపులైన నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో కేసీ కెనాల్, సుంకేసులు బ్యారేజీ, రోడ్లు భవనాలు శాఖ పర్యవేక్షణలోని రహదారులు, హెచపీసీఎల్ సంస్థ గ్యాస్ పైపులైన క్రాస్ చేస్తూ పనులు చేయాల్సి ఉంది. ఆయా శాఖల అనుమతుల కోసం ఈ నిధులు మంజూరు చేశారని, త్వరలోనే ఆయా శాఖల ఖాతాల్లో జమ చేస్తామని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు పేర్కొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 12:10 AM