ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

30 శాతం నిధులు కేటాయించాలి

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:37 PM

విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలలను మూసివేయరాదని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

గూడూరులో ర్యాలీ నిర్వహిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

ప్రాథమిక పాఠశాలలను మూసివేయరాదు

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

గూడూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలలను మూసివేయరాదని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గూడూరులో యూటీఎఫ్‌ జిల్లా స్వర్ణోత్సవ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన స్వర్ణోత్సవ మహాసభలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణను తప్పనిసరిగా ఉపాధ్యాయులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గూడూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌ కుమార్‌, నగర పంచాయతీ మాజీ వైస్‌ చైర్‌పర్సన ఇందిరా సుభాషిణి, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌, నాయకులు పాల్గొన్నారు

Updated Date - Nov 09 , 2024 | 11:37 PM