Minister Lokesh : 40 వేల ఉద్యోగాలు సృష్టించాలి
ABN, Publish Date - Jul 26 , 2024 | 03:02 AM
అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న తెలుగువారి ద్వారా రాష్ట్రంలో 40,000 ఐటీ ఉద్యోగాలు సృష్టించడానికి నడుం బిగించాలంటూ టీడీపీలోని ఎన్నారై ఎమ్మెల్యేలకు ఐటీ మంత్రి లోకేశ్ టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో గురువారం ఉదయం ఆయన ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. ‘అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు
కనీసం 400 కంపెనీలు ఏపీకి రావాలి
ఎన్నారై ఎమ్మెల్యేలకు మంత్రి లోకేశ్ టార్గెట్
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న తెలుగువారి ద్వారా రాష్ట్రంలో 40,000 ఐటీ ఉద్యోగాలు సృష్టించడానికి నడుం బిగించాలంటూ టీడీపీలోని ఎన్నారై ఎమ్మెల్యేలకు ఐటీ మంత్రి లోకేశ్ టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో గురువారం ఉదయం ఆయన ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. ‘అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు నడుతుపున్న ఐటీ కంపెనీలు 800 ఉన్నాయి. ఈ కంపెనీలకు అన్నింటికీ ఇప్పటికే హైదరాబాద్‌లో ఆఫీసులు ఉన్నాయి. అందులో సగం కంపెనీలతో అయినా మన రాష్ట్రంలో కూడా ఆఫీసులు పెట్టించాలి. ఒక్కో కంపెనీ కనీసం 100 ఐటీ ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం మీద 40 వేల ఉద్యోగాలు వస్తాయి. ఇంత మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తుంటే తర్వాత చాలా కంపెనీలు వస్తాయి. ఎన్నారై ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత తీసుకొని అమెరికాలోని కంపెనీల యాజమాన్యాలను కలిసి మాట్లాడి వారిని ఒప్పించాలి’ అని లోకేశ్, రాముకు సూచించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘ఐటీ కంపెనీలు కొన్ని వసతులు కోరుతున్నాయి. వాటిని సమకూర్చడం ఎలా అన్నది ఆలోచించాలి. ప్రధానంగా ప్లగ్ అండ్ ప్లే సదుపాయం ఉన్న భవనాలు అడుగుతున్నాయి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాలి’ అని చెప్పారు. విశాఖలో అటువంటి సదుపాయం ఉన్న భవనాలు సిద్ధంగా ఉన్నాయని, శిక్షణ ఏర్పాట్లు కూడా చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. దీనిపై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా లోకేశ్ అంగీకరించారు.
కృష్ణా జిల్లా ఎస్పీపై టీడీపీ నేతల అసంతృప్తి
కృష్ణా జిల్లాకు ఇటీవల ఎస్పీగా నియమితమైన గంగాధర్‌పై రాయలసీమ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో గురువారం ఆయనపై వారి మధ్య కొంతసేపు చర్చ జరిగింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన సమయంలో అంగళ్లు ప్రాంతంలో ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టడంలో గంగాధర్ కీలకంగా వ్యవహరించారని, వందల సంఖ్యలో టీడీపీ నేతలపై కేసులు పెట్టింది ఆయనేనని చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఆయనకు కృష్ణా జిల్లా ఎస్పీ పోస్టు ఇవ్వవకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ అధికారి కృష్ణా జిల్లాకు వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పట్ల మృదువుగా వ్యవహరిస్తున్నారని కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆరోపించారు. ’కొడాలి నాని పీఏను ఎవరో కొట్టారు. గంటలో ఎస్పీ అతని వద్దకు వెళ్లి కేసు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఆయనకు అంత అవసరం ఏమిటి? ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందని అనుకొంటున్నారా?’ అని ఆయన అన్నారు. వైసీపీలో ఎవరిని ఉపేక్షించినా కొడాలి నాని, వల్లభనేని వంశీని మాత్రం ఉపేక్షించరాదని, వారిద్దరూ అంత నీచంగా ప్రవర్తించారని మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వంశీ ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయాడని, కొడాలి నాని గుడివాడ వస్తే తిరగబడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వ్యాఖ్యానించారు.
Updated Date - Jul 26 , 2024 | 06:48 AM