ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు డబుల్‌ బొనాంజా

ABN, Publish Date - Jul 30 , 2024 | 04:10 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించారు.

జగన్‌ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు

ఇకపై గృహ నిర్మాణానికి రూ.4 లక్షలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున నిరుపేదలకు కేటాయించాలని నిశ్చయించారు. 2014-19 నడుమ పూర్తయిన ఇళ్లకు జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో చెల్లింపులు చేయలేదు. ఆ ఇళ్ల బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త లబ్ధిదారులందరికీ వర్తింపు

జగన్‌ ఇచ్చింది గ్రామాల్లో సెంటున్నర,

పట్టణాల్లో ఒక్క సెంటు స్థలమే

అది కూడా ఊరికి దూరంగా ఎక్కడో

సేకరణ, కేటాయింపుల్లో అవకతవకలు

గృహ నిర్మాణంపై చంద్రబాబు కీలక సమీక్ష

2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్లు

వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు ఏడాదిలో 8.25 లక్షలు కట్టడమే లక్ష్యం

మధ్య తరగతి ప్రజలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇళ్లు పూర్తయిన ఇళ్లకు చెల్లింపులుఆపేసిన గత ప్రభుత్వం

ఆ బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం

అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదలకు శుభవార్త. వారికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలివ్వాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత జగన్‌ ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున ఇచ్చి ఊరూవాడా డబ్బా కొట్టుకుంది. ఎన్నికల్లో అయితే భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు దానికి రెట్టింపు ఇవ్వాలని నిశ్చయించడం విశేషం. సోమవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని లక్ష్యం విధించారు. రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు. దీనికి తగినట్లుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం సమీక్ష తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సర్కారు ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని భూముల్లో ఇళ్లస్థలాలు పొందని పేదలకు కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిశ్చయించాం. జగన్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించారు’ అని చెప్పారు.

పోలవరం పునరావాస ఇళ్లు గృహనిర్మాణ శాఖకు!

పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగింతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలను కల్పించలేదని.. అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..

ఫ 2014-19 కాలాన్ని 2019-24 హయాంతో పోల్చితే.. గత ప్రభుత్వంలో పేదలకు రూ.9 వేల నుంచి 10 వేల కోట్ల వరకూ అన్యాయం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదలకు అందకుండా చేసింది.

ఫ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని తెగ చెప్పుకొన్న గత ముఖ్యమంత్రి.. వారికి ఎలాంటి అదనపు లబ్ధీ చేకూర్చలేదు. 2014-19 మద్య కాలంలో యూనిట్‌ ఖరీదు రెండున్నర లక్షలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.50 వేల నుంచి లక్ష వరకు లబ్ధి చేకూరింది.

ఫ కేంద్రం బడ్జెట్‌లో రూ.4 లక్షల యూనిట్‌ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలో సర్వే చేపడతాం. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఇది వర్తిస్తుంది.

ఫ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాల నిర్మాణం పురోగతిలో ఉంది. వాటిని కూడా పూర్తి చేస్తాం. పీఎఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తాం.

ఫ అమరావతి, తదితర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరై.. కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట సంబంధిత లబ్ధిదారులకు కొత్త పథకంలో ఇవ్వాలని నిర్ణయించాం.

Updated Date - Jul 30 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<