ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరాచక ఐపీఎస్‌లకు షాక్‌!

ABN, Publish Date - Jul 14 , 2024 | 04:16 AM

గత ప్రభుత్వంలో తాడేపల్లి ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించి అరాచకాలు సృష్టించిన పలువురు ఐపీఎస్‌ అధికారులను పక్కన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

9 మందిని పక్కన పెట్టిన ప్రభుత్వం

సమర్థత, నిష్పాక్షికతకు పెద్దపీట.. యువ అధికారులకు కీలక జిల్లాలు

23 జిల్లాల్లో కొత్త ఎస్పీలకు పోస్టింగ్‌

తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడు

గతంలో బాబుకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాయుడు

తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌పై రాక

బిందు మాధవ్‌కు కర్నూలు బాధ్యత

జగన్‌ హయాంలో వివక్షకు గురైన దామోదర్‌కు ప్రకాశం ఎస్పీగా చాన్స్‌

రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎ్‌సలకు స్థాన చలనం.. సర్కారు ఉత్తర్వులు

వైసీపీతో అంటకాగినోళ్లు వెయిటింగ్‌కు

డీజీపీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో తాడేపల్లి ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించి అరాచకాలు సృష్టించిన పలువురు ఐపీఎస్‌ అధికారులను పక్కన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదేసమయంలో సమర్థులైన ఐపీఎ్‌సలకు పలు కీలక జిల్లాల సారథ్యాన్ని అప్పగించింది. ఈ మేరకు శనివారం భారీ ఎత్తున ఐపీఎ్‌సల బదిలీలు చేపట్టింది. జిల్లా ఎస్పీలను గత ప్రభుత్వం పావులుగా వాడుకుంది. ప్రతిపక్షాలపై వారిని ఊసిగొల్పి అడ్డమైన కేసులు పెట్టి వేధించింది. ప్రభుత్వం మారగానే వీరందరి వ్యవహార శైలిపై సుదీర్ఘ కసరత్తు చేసిన దరిమిలా.. 37 మంది ఎస్పీ స్థాయి ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ఏం చెబితే అది గుడ్డిగా చేస్తూ, విపక్షాలను వేధించిన శ్రీకాకుళం ఎస్పీ రాధికకు పోస్టింగ్‌ ఇవ్వకుండా డీజీపీ ఆఫీ్‌సలో రిపోర్ట్‌ చేయించారు. ఈమె శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉంటూ వైసీపీ నేతలకు వత్తాసు పలికారు. టీడీపీ బాధితులు ఫిర్యాదులు చేసినా, గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.

అప్పట్లో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ఏం చెబితే అది గుడ్డిగా చేస్తూ, విపక్షాలను వేధించిన శ్రీకాకుళం ఎస్పీ రాధికకు పోస్టింగ్‌ ఇవ్వకుండా డీజీపీ ఆఫీ్‌సలో రిపోర్ట్‌ చేయించారు. ఈమె శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉంటూ వైసీపీ నేతలకు వత్తాసు పలికారు. టీడీపీ బాధితులు ఫిర్యాదులు చేసినా, గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.

జగన్‌ హయాంలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపైన, మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంపైన వైసీపీ మూకలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చర్యలు తీసుకోవాల్సిన ఎస్పీ ఆరిఫ్‌ ప్రేక్షక పాత్ర పోషించారు. అనంతరం, జగన్‌ ప్రభుత్వమే ఆయనను నెల్లూరులో నియమించింది. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం ఆయనను డీపీజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన ఎస్పీ జగదీశ్‌కు కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారానికి వచ్చిన సినీనటుడు అల్లు అర్జున్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎన్నికల వేళ అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించినా అడ్డు చెప్పని ఎస్పీ రఘువీరారెడ్డిని పక్కన పెట్టారు.

కడపలో వైసీపీకి నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ, ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ.. జగన్‌ ప్రత్యర్థి బీటెక్‌ రవిలాంటి వారిని తప్పుడు కేసుల్లో ఇరికించిన సిద్ధార్థ కౌశిల్‌కు పోస్టింగ్‌ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ ఆగ్రహానికి గురై సరైన పోస్టింగ్‌ లేకుండా ఉన్న ఐపీఎస్‌లకు ఈసారి సముచిత స్థానం దక్కింది.

అనంతపురం ఎస్పీగా ఉన్న శ్రీనివాసరావును గత వైసీపీ ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో అన్బురాజన్‌ను నియమించింది. ఈయనకు జగన్‌ కాంపౌండ్‌ అధికారిగా పేరుంది. అనంతపురంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో ఆయనను ఈసీ బదిలీ చేసింది. ఈస్థానంలో అమిత్‌ బర్దార్‌ను ఎస్పీగా నియమించింది. ఆయన ఎన్నికల సమయంలో తాడిపత్రిలో హింసను అరికట్టే క్రమంలో రాళ్లదాడికి గురై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆయనకు అల్లూరి జిల్లా ఎస్పీగా అవకాశం ఇచ్చింది.

గతంలో చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి, ఐపీఎస్‌ హోదా రాగానే తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయిన ఎల్‌. సుబ్బరాయుడును డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకువచ్చారు. కీలకమైన తిరుపతి జిల్లాకు ఎస్పీగా నియమించారు. ఎర్రచందనం కట్టడి విభాగానికి ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

పల్నాడు ఎస్పీగా పని చేస్తూ వైసీపీ చేసిన తప్పుడు ఫిర్యాదులు కారణంగా సస్పెన్షన్‌కు గురైన బిందు మాధవ్‌ను కర్నూలు ఎస్పీగా నియమించారు.

అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతలు చెప్పినట్లు వినకుండా రూల్స్‌ ప్రస్తావించి.. పోస్టింగ్‌ పోగొట్టుకున్న హర్షవర్దన్‌ రాజు, రెడ్డి గంగాధర్‌రావులను కడప, కృష్ణా జిల్లాల ఎస్పీలుగా నియమించారు.

గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు తీవ్ర వివక్షకు గురైన దామోదర్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్‌ లభించింది.

Updated Date - Jul 14 , 2024 | 04:16 AM

Advertising
Advertising
<