ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:07 AM

ఆస్తి కోసం కన్నతండ్రినే కొడుకు చంపిన ఘటన చిప్పగిరి మండలంలో ఆదివారం జరిగింది.

నిందితుడు శ్రీనివాసులు అరెస్ట్‌ చేస్తున్నట్లు వివరిస్తున్న డీఎస్పీ వెంకటరామయ్య

చిప్పగిరి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఆస్తి కోసం కన్నతండ్రినే కొడుకు చంపిన ఘటన చిప్పగిరి మండలంలో ఆదివారం జరిగింది. చిప్పగిరి పోలీస్‌ స్టేషనలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటరామయ్య తెలిపిన వివరాల మేరకు... చిప్పగిరి-గుంతకల్‌ మధ్య ఓ పొలంలో సెప్టెంబర్‌ 13వ తేదీన కురువ కారుమంచప్ప చెట్టుకి ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే.. దీనిపై పోలీసులు పలు విధాలుగా దర్యాప్తు చేపట్టారు. కారుమంచప్ప పెద్ద కుమారుడు శ్రీనివాసులు ఆస్తి కోసం తండ్రిని చంపి చెట్టుకు ఉరివేశాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. 20 ఎకరాల పొలం ఉంది. పెద్ద కుమారుడు శ్రీనివాసులకు మాగాణి పొలాన్ని ఇచ్చాడు. చిన్న కుమారుడు ప్రసాద్‌కు విలువైన పొలాన్ని ఇచ్చాడు. 12 ఎకరాల పొలంలో ఆరు ఎకరాల తన భార్య పేరున రాశాడు. మిగిలిన ఆరు ఎకరాలను ఇద్దరు కూతుళ్లకు సమానంగా పంచి ఇస్తానని చెప్పడంతో కొడుకు తగాదా పడ్డాడు. 12 ఎకరాలు తనకే ఇవ్వాలని పెద్ద కొడుకు తరచూ తగాదా పడేవాడు. ఈ విషయంపై పెద్ద మనుషులతో పంచాయితీ కూడా జరిగింది. తండ్రి ఉంటే తనకు ఆస్తి రాదని భయంతో పెద్ద కొడుకు శ్రీనివాసులు పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డాడు. గుంతకల్‌ నుంచి చిప్పగిరికి వస్తున్నప్పుడు తండ్రిని చంపి, తాము కౌలుకు తీసుకున్న పొలంలో చెట్టుకు వేలాడదీసిశాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య వివరించారు.

Updated Date - Nov 11 , 2024 | 12:07 AM