హిందూ హక్కుల రక్షణకు అలుపెరుగని పోరు, protection of Hindu rights
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:02 PM
విశ్వహిందూ సమాజం హక్కుల, రక్షణ కోసం అలుపెరుగని పోరు సాగించేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని విశ్వహిం దూ పరిషత్ (వీహెచ్‌పీ) అఖిల భారత మార్గదర్శక మండలి సభ్యుడు విరజానందస్వామి స్పష్టంచేశారు. విశ్వవ్యాప్తంగా వున్న వేలాది ధార్మిక సంస్థ ల ఏకైక విశ్వ వేదిక విశ్వహిందూ పరిషత్ అన్నా రు.
ఆత్మీయ హిందూ సమ్మేళనంలో వీహెచ్‌పీ అఖిలభారత మార్గదర్శక మండలి సభ్యులు
కడప (కల్చరల్) సెప్టెంబరు 1: విశ్వహిందూ సమాజం హక్కుల, రక్షణ కోసం అలుపెరుగని పోరు సాగించేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని విశ్వహిం దూ పరిషత్ (వీహెచ్‌పీ) అఖిల భారత మార్గదర్శక మండలి సభ్యుడు విరజానందస్వామి స్పష్టంచేశారు. విశ్వవ్యాప్తంగా వున్న వేలాది ధార్మిక సంస్థ ల ఏకైక విశ్వ వేదిక విశ్వహిందూ పరిషత్ అన్నా రు. 1964లో శ్రీ కృష్ణ జయంతి రోజున ఏర్పాటైన వీహెచ్‌పీ అంచెలంచెలుగా సుమారు వంద దేశాల కు విస్తరించి, యావత్ భారతంలోని సమస్త ఽధర్మాచార్యులు, సాధుసంతుల ఆశీస్సుల బలంతో నిరంతరం వికసిస్తూ ముందుకు సాగుతోందన్నారు. వీహెచ్‌పీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నగర వీహెచ్‌పీ శాఖ ఆధ్వర్యంలో ఆదివా రం స్థానిక చిన్మయమిషన్ లలితా పంచాయతన దేవాలయంలో వీహెచ్‌పీ దక్షిణాంద్ర ప్రాంత ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ బెస్తవేముల రామ్‌మహేష్ అధ్యక్షతన కడప నగర ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ హిందూ సమాజం అన్ని వైపుల నుంచీ దాడులకు గురౌతున్న సమయంలో ‘యథా యథాహి ధర్మస్య’ అన్న రీతిలో కృష్ణాష్టమి రోజున భారతగడ్డ మీద ఆవిర్భవించిన సంస్థగా ఖ్యాతిగాంచిందన్నారు. ప్రధానంగా అయోధ్య ఉద్యమం చరిత్రను మలుపు తిప్పిందన్నారు. ప్రతి హిందువు తనను తాను హిందువు అని చెప్పుకునే స్థితికి తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా తమ వీహెచ్‌పీ కీర్తిపతాకం దేశ విదేశాల్లో ఎగరటానికి ప్రధాన కారణం ఆందోళనాత్మక కార్యక్రమాలే అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం, దక్షిణాంద్ర ప్రాంత మార్గదర్శక మండలి సభ్యులు తురీయానంద సరస్వతిస్వామి, పూర్వప్రాంత అధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు, జిల్లా ఉపాధ్యక్షురాలు హేమమాలిని, కార్యదర్శి మనోహర్, పలువురు హిందూ బంధువులు, ధార్మిక సంస్థల కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా హాజరైన వారికి శ్రీరామ అక్షింతలు పంపిణీ చేశారు.
Updated Date - Sep 01 , 2024 | 11:02 PM