రోత వ్యాఖ్యలతో బాధించా
ABN, Publish Date - Nov 15 , 2024 | 02:03 AM
సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోమ్ మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న సినీ నటి శ్రీరెడ్డి గురువారం మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు.
క్షమించండి.. కేసుల నుంచి తప్పించండి
మంత్రి లోకేశ్‌కు నటి శ్రీరెడ్డి లేఖ
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోమ్ మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న సినీ నటి శ్రీరెడ్డి గురువారం మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు. తనను మన్నించాలంటూ ఇప్పటికే ఒకసారి వీడియోద్వారా లోకేశ్‌ను శ్రీరెడ్డి అభ్యర్థించారు. ఆ వీడియోలోని అంశాలనే లోకేశ్‌కు రాసిన లేఖ లో ఆమె ప్రస్తావించారు. ‘‘నా రోత భాషతో ఎంతమందిని బాధ పెట్టానో గత పదిరోజుల్లో జరిగిన పరిణామాలతో తెలుసుకున్నాను. టీడీపీ, జనసేన, వాటి అనుబంధ విభాగాల నేతలు, వారి కుటుంబాలు, కొన్ని పత్రికలు, చానల్స్‌పై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నన్ను కేసుల నుంచి బయటపడేయండి.’’ అని ఆ లేఖలో శ్రీరెడ్డి కోరారు.
మీకూ,పార్టీకీ దూరమవుతున్నా..
జగన్,భారతికి శ్రీరెడ్డి లేఖ
మాజీ సీఎం జగన్,ఆయన సతీమణి భారతిరెడ్డికి తన తీరుతో బాధ కలిగించానని, అందువల్ల అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నానని నటి శ్రీరెడ్డి తెలిపారు. ఈ మేరకు జగన్,భారతిని ఉద్దేశించి ఆమె లేఖ రాశారు. వైసీపీ ప్రత్యర్థులను సోషల్‌మీడియాలో ఎదుర్కొంటున్నానని అనుకున్నానేగానీ, తనవల్ల పార్టీకి ఇంతనష్టం జరుగుతుందని తెలుసుకోలేకపోయానని ఆ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 02:04 AM