ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: భరత్‌పై ఆదిరెడ్డి వాసు షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Mar 27 , 2024 | 06:38 PM

వైసీపీ నాయకుడు, స్థానిక ఎంపీ మార్గాని భరత్‌‌‌పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజమండి, మార్చి 27: వైసీపీ నాయకుడు, స్థానిక ఎంపీ మార్గాని భరత్‌‌‌( Margani Barath) పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు (Adireddy vasu) షాకింగ్ కామెంట్స్ చేశారు. మార్గాని భరత్‌కు స్మగ్లింగ్ బ్యాచ్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ (indira gandhi international airport)లో కస్టమ్స్ అధికారులకు రూ. 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడిన నరేష్ కుమార్ జైన్‌తో ఎంపీకి సంబంధాలున్నాయన్నారు. ఎంపీ భరత్‌తో నరేష్ కుమార్ జైన్‌ కలిసి ఉన్న ఫోటోలను ఈ సందర్బంగా మీడియాకు వాసు విడుదల చేశారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌తో ఎంపీ భరత్‌‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ఒడిశా బ్రాహ్మణులు, మార్వాడిలను గుద్ది చంపేస్తానంటూ వైసీపీ సానుభూతి పరుడు ఫొన్‌లో బెదిరించారని.. ఈ అంశంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆదిరెడ్డి వాసు తెలిపారు.

ఈ ఎన్నికల్లో రాజమండ్రి సీటీ టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు బరిలో దిగారు. అలాగే ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్ రంగంలోకి దిగారు. అయితే గత ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ బరిలో దిగి గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి భవానీ పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ సారి రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలో దిగారు.

మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 07:00 PM

Advertising
Advertising