Adults should be made literate : వయోజనులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దాలి
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:32 PM
నిరక్ష్య రాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకంను రూపొందించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ తెలిపారు.
నేటి నుంచి 24 వరకు నిరక్ష్యరాస్యత సర్వే
జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్
కడప(కలెక్టరేట్) అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): నిరక్ష్య రాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకంను రూపొందించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ డీఆర్వో చాంబరులో అడల్డ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్ స్టాండింగ్ అఫ్ లైన్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ పథకంపె నిర్వహించిన సమావేశంలో డీఆర్వో మాట్లాడుతూ దేశంలో వందశాతం అక్ష్యరాస్యతను సాధించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉండి చదువు ఆపేసిన లేదా చదువుకోని పెద్దలను గుర్తించి అక్ష్యరాస్యతను అందిస్తామన్నారు. వారికి ప్రాథమిక విద్య, డిజిటల్ విద్య, ఆర్థిక విద్యను అందిస్తార న్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్య రాస్యులను గుర్తించడానికి 4.15 లక్ష్యంగా పెట్టుకుందన్నారు, అందులో మన జిల్లాలో 23,170 మంది నిరక్ష్య రాస్యులను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక సం ఘాల మహిళలు, అంగన్వాడీ, ఆయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేసే నైట్ వాచ్‌మన్‌లు తదితరులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
16 నుంచి 24 వరకు డీఆర్డీఏ క్లస్టర్ కో ఆర్డినేటర్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో నిరక్ష్యరాస్యుల సర్వేచేపడుతున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్, గ్రామీణ వార్డు సచివాలయం సిబ్బంది, సమన్వయ సహకారంతో పని చేయాలన్నారు. ఈశిక్షణా తరగతులు పూర్తి చేసుకున్న వారికి వచ్చేఏడాది మార్చిలో అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలు సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ ఎం.వి. సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఈఓ అనురాధ, జీఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ అధికారి సుబ్రమణ్యం, ఐసీడీసీ, పంచాయితీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 15 , 2024 | 11:32 PM