ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అన్ని దారులూ ఏపీ వైపే!

ABN, Publish Date - May 12 , 2024 | 04:06 AM

రాష్ట్రంలో ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. సోమవారం జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏపీలో ఓటు హక్కుకలిగిన ప్రతి ఒక్కరూ కదలి వస్తున్నారు.

ఓటు దారిలో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిట

ఆంరఽధాకు పోటెత్తుతున్న ఎన్‌ఆర్‌ఐలు, వలస కూలీలు

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై కార్ల ప్రవాహం

తెలంగాణ బస్సుల క్లియరెన్స్‌ కోసం

బెజవాడ సీపీకి ఫోన్‌ చేసిన అక్కడి అధికారులు

గరికపాడు చెక్‌ పోస్టు వద్ద ప్రత్యేక లైన్‌కు విజ్ఞప్తి

చిల్లకల్లు, కీసర టోల్‌గేట్ల దగ్గర ప్రత్యేక లైన్‌లు

విజయవాడ, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. సోమవారం జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏపీలో ఓటు హక్కుకలిగిన ప్రతి ఒక్కరూ కదలి వస్తున్నారు. బస్సులు.. రైళ్లు.. విమానాలు.. కార్లు.. అన్ని కిటకిటలాడిపోతున్నాయి. దూరప్రాంతాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు మొదలు సామాన్యుల వరకు విజయవాడకు పోటెత్తుతున్నారు. మరోవైపు రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఇంకో వైపు విమానాల్లో ప్రవాసుల రాకతో హడావిడి నెలకొంది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై బస్సులు, కార్లు పోటెత్తాయి. ఏపీకి చెందిన 231 షెడ్యూల్‌ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గరికపాడు చెక్‌పోస్టు దగ్గర బస్సులు, వాహనాల తనిఖీ కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడటంతో టీఎ్‌సఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌.. విజయవాడ సీపీ రామకృష్ణకు ఫోన్‌ చేశారు. గరికపాడు చెక్‌పోస్టు దగ్గర టీఎ్‌సఆర్‌టీసీ బస్సులు ఏపీలోకి ప్రవేశించటానికి వీలుగా ప్రత్యేక లైన్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని సూచించారు. వెంటనే సీపీ కూడా స్పందించి గరికపాడు చెక్‌పోస్టుతో పాటు, చిల్లకల్లు, కీసర టోల్‌గేట్ల దగ్గర హైదరాబాద్‌ నుంచి వచే ్చ బస్సుల కోసం ప్రత్యేక లైన్‌ కేటాయించారు. మరోవైపు ఆర్టీసీ బస్సులతో పాటుగా అద్దె కార్లు, సొంత కార్లలో... జాతీయ రహదారిపై ఇసుక వేస్తే రాలనంతగా విజయవాడకు వస్తున్నారు. ఎన్నికల ముందు ఇంత భారీ సంఖ్యలో కార్లు రావటంతో బోర్డర్‌ చెక్‌ పోస్టులలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కీసర టోల్‌గేట్‌ దగ్గర జాతీయ రహదారిపై వస్తున్న వాహనాల శ్రేణి యుద్ధానికి వస్తున్నట్టుగా ఉంది. ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి వస్తున్న ప్రయాణికులు పీఎన్‌బీఎ్‌సలో ప్లాట్‌ఫామ్‌ల దగ్గర వేచిచూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో అఽర్టీసీ అధికారులు ప్రయాణికులు అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపారు. హైదరాబాద్‌ - విజయవాడ, సికింద్రాబాద్‌ -విజయవాడ, బెంగళూరు-విజయవాడ, చెన్నై-విజయవాడ మధ్యన రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి.

Updated Date - May 12 , 2024 | 04:06 AM

Advertising
Advertising