ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వలంటీర్లంతా బానిసలన్నట్టు..

ABN, Publish Date - Apr 13 , 2024 | 04:23 AM

మొన్నటి దాకా ‘వలంటీర్లకు వందనం’ అని సన్మానాలు చేశారు. అంతకుముందు నుంచే వారిని ‘కార్యకర్తలు’గా మార్చేసుకున్నారు...

జగనన్న ఆదేశాలు పాటించాల్సిందే

కార్యకర్తల్లా సేవలు అందించాల్సిందే

కాదూ కూడదంటే ఊరుకునేది లేదు

వలంటీర్లపై వైసీపీ నేతల జులుం

ససేమిరా అంటున్న వలంటీర్లు

వైసీపీకి ఇక ‘నో చాన్స్‌’ అనే అంచనా

చంద్రబాబు హామీల ప్రభావం

భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశ

వైసీపీకి దూరంజరుగుతున్న వలంటీర్లు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): మొన్నటి దాకా ‘వలంటీర్లకు వందనం’ అని సన్మానాలు చేశారు. అంతకుముందు నుంచే వారిని ‘కార్యకర్తలు’గా మార్చేసుకున్నారు. ఇప్పుడు... సొంత పనివాళ్లలాగా, ఇంకా చెప్పాలంటే బానిసల్లా చూస్తున్నారు! ఎన్నికల ముందు ఇదీ వైసీపీ నేతల వైఖరి! ‘రాజీనామా చేసి మా పార్టీ సేవలో తరించండి’ అని వైసీపీ ఒత్తిడి తెస్తున్నా... అతి తక్కువమంది వలంటీర్లు మాత్రమే రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ నాయకులు అసహనంతో రగిలిపోతున్నారు. ‘మీరు మా జీతగాళ్లు. మేం చెప్పినట్లు వినాల్సిందే’ అంటూ కన్నెర్ర చేస్తున్నారు. ‘‘జగనన్న ఆదేశాలనే పాటించరా? రాజీనామాలకు ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని నిలదీస్తున్నారు.

ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకే...

వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని, వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా నియమించవద్దని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ వంకర ఎత్తుగడ వేసింది. వలంటీర్ల చేత రాజీనామా చేయించి... వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించాలని యోచిస్తోంది. అప్పుడు... పోలింగ్‌ కేంద్రాల్లోనే ఓటర్లను బెదిరించి ప్రభావితం చేయవచ్చు. కానీ... వలంటీర్లలో అత్యధికులు రాజీనామాలు చేసేందుకు ఇష్టపడటంలేదు. ‘‘ఇప్పటి వరకు వైసీపీ నేతలు చెప్పిన పనులన్నీ చేశాం. బానిసల్లా గొడ్డుచాకిరీ చేశాం. అదంతా విధి నిర్వహణలో భాగమని సరిపెట్టుకున్నాం. కానీ... రాజీనామాలు చేసేసి పార్టీ కార్యకర్తలుగా మారాలంటే ఎలా?’’ అని వలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. ఉన్నపళంగా గ్రామాల్లో పార్టీ కార్యకర్తల అవతారమెత్తలేమని మొహం చాటేస్తున్నారు. గ్రామాల్లో ప్రజల నాడిని స్పష్టంగా గమనిస్తున్న వలంటీర్లు వైసీపీకి ఇంకో చాన్స్‌ దక్కే అవకాశమే లేదనే అంచనాకు వచ్చారు. జనాలు ఎవరి అభిప్రాయంతో వారు ఉన్నారని, పథకాలు అమలు చేసినప్పుడు తమమాట విన్నప్పటికీ... ఇప్పుడెవరూ తమను పట్టించుకోవడం లేదని కొందరు వలంటీర్లు చెబుతున్నారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. తామెంత నచ్చజెప్పినా జనం నమ్మే స్థితిలో లేరని వలంటీర్లు తమ అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి లేనిపోని ఇబ్బందుల్లో పడడం ఎందుకని భావిస్తున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వ సేవకులమని చెప్పి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలమంటూ ప్రజల వద్దకు వెళ్తే ఛీకొడతారేమోనని మరికొందరు ముఖం చాటేస్తున్నారు.

వలంటీర్లపై జులుం...

వలంటీర్ల ‘సహాయ నిరాకరణ’ను వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. అదేదో సొంత సొమ్ము ఊరికే ఇచ్చినట్లు... ‘‘ఐదేళ్లుగా జగనన్న మీకు ఉద్యోగాలిస్తే ఇప్పుడు దూరంగా వెళ్తారా? రాజీనామాలు చేయాల్సిందే. చేయకుంటే ఊరుకునేది లేదు’’ అని హెచ్చరిస్తున్నారు. ‘రాజీనామాలు చేయించండి. వైసీపీ కార్యకర్తల్లా పని చేసేలా చూడండి’ అని స్వయంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నాయకులను ఆదేశించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు తమ వైఖరి స్పష్టంగా చెబుతున్నారు. వీరిని కొనసాగిస్తామని... రాజకీయాలు చేయని వలంటీర్లకు ముప్పుండదని.. పైగా వారికి ఇప్పుడిస్తున్న పారితోషికాన్ని రూ.10వేలు చేస్తామని.. వారి భవిష్యత్‌ మెరుగుపరుస్తామని.. బాగా చదువుకున్న వలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. వీటిని ఎక్కువ మంది వలంటీర్లు విశ్వసిస్తున్నారని వైసీపీ స్థానిక నేతలు సైతం అంగీకరిస్తున్నారు. జగన్‌ ఒత్తిడితో రాజీనామా చేస్తే.. టీడీపీ ప్రభుత్వంలో తమకు అవకాశాల్లేకుండా పోతాయని అంటున్నారని చెబుతున్నారు.

వలంటీర్లుగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కేసులు పెడతామని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ హెచ్చరించింది. అలాంటివారిపై విపక్షాలు కూడా ఫిర్యాదు చేయడం.. కొందరిపై అధికారులు వేటు వేయడం కూడా జరుగుతోంది. వారిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. దీనిని బూచిగా చూపి.. ఇప్పుడు వలంటీర్లుగా వైదొలిగితే మళ్లీ జగన్‌ గద్దెనెక్కగానే వారి పోస్టులు వారికి ఇస్తామని వైసీపీ నేతలు ప్రలోభపెడుతున్నారు.

రాజీనామా చేయాల్సిందే..

  • వైసీపీ నేత హెచ్చరిక

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 12: స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి వలంటీర్లను సీఎం జగన్‌ సొంత మనుషుల్లా చూసుకుని ఒక గొప్ప అవకాశం కల్పించారని.. వారు కృతజ్ఞతలు చూపించడానికి ప్రస్తుత ఎన్నికల కంటే గొప్ప అవకాశం రాదని ఓ వైసీపీ ముఖ్య నేత సందేశం పంపారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టికి చెందిన ఆయన.. శుక్రవారం వాట్సా్‌పలో హెచ్చరిక పంపారు. ‘దయచేసి రేపటిలోగా రాజీనామా చేయాలి. లేదంటే మీ అందరినీ టీడీపీ కోవర్టుల్లా చూస్తాం. పైగా రేపు మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరు చెప్పినా.. కనీసం సచివాలయం గేటు కూడా మీరు తాకలేరు. అర్థం చేసుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేయండి’ అని అందులో స్పష్టం చేశారు.

Updated Date - Apr 13 , 2024 | 04:23 AM

Advertising
Advertising