ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బెయిల్‌ కోసం సోనియా వద్దకు రాయబారం!

ABN, Publish Date - Apr 30 , 2024 | 04:29 AM

అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నప్పుడు.. బెయిల్‌ కోసం ఆయన తన తల్లిని, చెల్లిని నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్దకు పంపారని ఆ పార్టీ సీనియర్‌ నేత కొప్పుల రాజు ధ్రువీకరించారు.

జగన్‌ తల్లిని, చెల్లిని పంపారు

షర్మిల చెప్పింది నిజమే: కొప్పుల రాజు

నెల్లూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నప్పుడు.. బెయిల్‌ కోసం ఆయన తన తల్లిని, చెల్లిని నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్దకు పంపారని ఆ పార్టీ సీనియర్‌ నేత కొప్పుల రాజు ధ్రువీకరించారు. అలాగే రాజశేఖర్‌రెడ్డి పేరు సీబీఐ చార్జిషీటులో చేర్చాలని తాను చెప్పలేదని షర్మిలకు సోనియా క్లియర్‌గా చెప్పారని.. దీనివల్లే ఆమె ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని తెలిపారు. కడప లోక్‌సభ స్థానంలో ఆమె విజయం ఖాయమని చెప్పారు. రాష్ట్ర ఐఏఎస్‌ అధికారి అయిన రాజు.. మూడేళ్లు సర్వీసు ఉండగానే రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సలో జరిగిన, జరుగబోయే పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ సోమవారం నిర్వహించిన ‘బిగ్‌ డిబెట్‌లో’ కొప్పుల రాజు మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యాంశాలివీ..

ఆర్‌.కె: ఏపీలో కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనే సాహసం ఎందుకు చేశారు?

కొప్పుల రాజు: సాహసంగా అనిపిస్తోంది. చాలా ఎంజాయ్‌ కూడా చేస్తున్నా. ఇదో కొత్త అనుభూతి. 11 ఏళ్లు ఏఐసీసీలో క్రియాశీలంగా పనిచేశా. ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగడం ఇదే మొదటిసారి. ఇది కొత్త అనుభూతి.

2013లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయే సమయంలో ఆ పార్టీలో ఎందుకు చేరారు?

నేను ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు బలోపేతం చేశా. ఈ ప్రోగ్రామ్‌ మొదలుపెట్టినప్పుడు మొదట్లో డ్వాక్రా సంఘాలకు రూ.500 కోట్లు రుణం ఇచ్చేవారు. నేను చేపట్టిన విస్తరణ కారణంగా రూ.15 వేల కోట్లకు పెరిగాయి. అప్పటి సీఎంలు రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన వడ్డీ రాయితీ, వడ్డీ లేని రుణాలు బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం అమలు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టా. ఆ చట్టం పేదవాడికి న్యాయం చేసేలా కట్టుదిట్టంగా రూపకల్పన చేశారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ దృష్టిలో పడ్డాను. ఆయన ఇక్కడకు వచ్చి ఉపాధి హామీ పథకం పనితీరును స్టడీ చేశారు. నన్ను అమేఠీ తీసుకెళ్లి నియోజకవర్గ అధికారులతో ఈ పథకంపై శిక్షణ ఇప్పించారు. ఈ పరిచయంతో రాహుల్‌ నన్ను కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు. 20 సెకన్లు కూడా ఆలోచించకుండా పార్టీలో చేరిపోయా.

బెయిల్‌ కోసం జగన్‌ తన తల్లిని, చెల్లిని సోనియా వద్దకు పంపారట.. నిజమేనా?

నిజమండీ. నాక్కూడా తెలుసు. నేనూ విన్నా ను. షర్మిలమ్మ బహిర్గతం చేసిన ఆ విషయం నూరు పాళ్లు నిజమనే నమ్ముతున్నాను.

మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఇందులో డిప్లమసీ ఎందుకు?

అప్పుడు నేనుక్కడ లేను. విన్నానంతే.

రాజశేఖర్‌రెడ్డి పేరు సీబీఐ చార్జిషీటులోకి రావడానికీ వీళ్ల అడ్వకేట్‌ కారణమట కదా!

అది వాస్తవం. చాలా క్లియర్‌గా సోనియాగాంధీ షర్మిలమ్మకు చెప్పారట! రాజీవ్‌గాంధీ పేరు సీబీఐ (భోపార్స్‌ కేసు) ఎక్కించినప్పుడు నేను చాలా బాధపడ్డాను.. రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చాలని నేను చెప్పలేదని స్పష్టంగా చెప్పారట! అది విన్నాక షర్మిలమ్మ ఆలోచనా విధానంలోనూ మార్పు వచ్చింది.

షర్మిల కాంగ్రె్‌సలో చేరాలనుకున్నప్పుడు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది కాంగ్రెస్‌ నేతలే కదా!

నేను కూడా విన్నాను. జగన్‌ ఫోన్‌ చేసి.. అవసరమైతే నా మద్దతు కూడా మీకిస్తాను.. ఆమెను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పారట! అది నిజమో కాదో నిర్ధారించలేను. అందుకే షర్మిల చేరిక ఆలస్యమైందంటున్నారు.

రేపు 10, 15 ఎంపీ స్థానాలు అవసరమైతే జగన్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకోరన్న గ్యారెంటీ ఏమిటీ?

ఏపీ విషయంలో హైకమాండ్‌ క్లారిటీగా ఉంది. కాం గ్రె్‌సకు పూర్వ వైభవం తేవాలని కృతనిశ్చయంతో ఉంది.

ఆ పరిస్థితి వస్తే జగన్‌నే కాంగ్రె్‌సలో చేరిపొమ్మంటుందేమో?

ఏమో.. భవిష్యత్‌లో చాలా జరుగుతాయండీ..

షర్మిలను తీసుకెళ్లి కడపలో జగన్‌కు అత్యంత సన్నిహితుడిపై పోటీకి నిలబెట్టారు!

మా గ్రౌండ్‌ రిపోర్టు ప్రకారం కడపలో షర్మిలమ్మ గెలువబోతున్నారు. ఇది వంద శాతం నిజం కాబోతోంది. ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నాయి. తప్పకుండా ఆమె గెలుస్తారు.

తెలంగాణ ఇచ్చిన విధానమే తప్పయితే.. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్‌రెడ్డిని హ్యాండిల్‌ చేయడంలో కూడా విఫలమయ్యారనేది విస్తృత అభిప్రాయం. దీనికేమంటారు?

ముఖ్యమంత్రి పదవి ఎప్పుడిస్తారో ఏమో అనే విషయంలోనే జగన్‌ డిఫర్‌ అయ్యారు. కానీ ఆయనకు ఆ పదవి ఇవ్వబోమని చెప్పారని మాత్రం నేననుకోను. ఇక, కేసులు పెట్టింది కాంగ్రెస్‌ కాదు. సీబీఐ.

Updated Date - Apr 30 , 2024 | 04:29 AM

Advertising
Advertising