40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ambati Rambabu: దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాను..

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:45 AM

ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు.

Ambati Rambabu: దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాను..

గుంటూరు: ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు. గతంలో తాను వెళ్లిన సమయంలో కూడా గొడవ జరిగిందన్నారు. తాను నిర్వహించబోయే కార్యక్రమం గురించి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ముందే పోలీసులకు ఓ మాట చెప్పి ఉండాల్సిందని అంబటి సలహా ఇచ్చారు. షర్మిల చిన్న పిల్ల అని.. ఓవర్ యాక్షన్ చేస్తోందని విమర్శించారు. మిర్చి యార్డులో వర్గ పోరు లేదన్నారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే సర్థుబాటు అవుతాయన్నారు. అందరం జగన్ నాయకత్వంలో పని చేస్తామని అంబటి పేర్కొన్నారు.

అయితే పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో జరిగిన దాడిలో అంబటి హస్తముందని నేడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆ దాడిలో గాయపడిన పీఆర్ఓను పరామర్శించిన అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు. గంజాయి తాగి దాడికి పాల్పడ్డారన్నారు. కరెంట్ తీసి రాళ్లతో ఊరేగింపుపై దాడికి వైసీపీ గుండాలు పాల్పడ్డారని కన్నా పేర్కొన్నారు. తమపై హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందన్నారు. దేవుని దయవల్ల చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. పోలీసులు చర్యలు తీసుకోవాలని కన్నా పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:45 AM

Advertising
Advertising