ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కర్నూలులో ప్రత్యక్షమైన అఘోరి

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:59 PM

తెలుగు రాషా్ట్రల్లో హల్‌చల్‌ చేస్తున్న మహిళా అఘోరి శుక్రవారం కర్నూలులో ప్రత్యక్షమయ్యారు.

హైదరాబాదు - బెంగుళూరు జాతీయ రహదారిపై పాదయాత్రగా వెళుతున్న అఘోరి నాగసాధు

బళ్లారి చౌరస్తా నుంచి గుత్తి రోడ్డు వైపు వెళ్లిన నాగసాధువు

యాగంటి వెళ్లి పూజలు చేస్తానని వెల్లడించిన వైనం

కర్నూలు కల్చరల్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలుగు రాషా్ట్రల్లో హల్‌చల్‌ చేస్తున్న మహిళా అఘోరి శుక్రవారం కర్నూలులో ప్రత్యక్షమయ్యారు. మధ్యాహ్న సమయంలో నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి గుత్తి రోడ్డు వైపు హైదరాబాదు - బెంగళూరు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లింది. స్థానికులు మొదట ఆమెను వింతగా చూసి ఆ తర్వాత మొక్కేందుకు ప్రయత్నించారు. కొందరు యువకులు సెల్ఫీలు తీసుకునే యత్నం చేయగా వారిని దాటుకుంటూ ఆమె ముందుకు సాగారు. ఐటీ సర్కిల్‌ వద్ద ఒక మహిళా భక్తురాలు ఇచ్చిన మంచినీటిని తాగి కొద్దిసేపు రోడ్డు పక్కన డివైడర్‌పై కూర్చుండిపోయారు. పోలీసులు ఇబ్బంది పెట్టడం వల్లే తన కారు ప్రమాదం జరిగిందని అన్నారు. పోలీసులు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి.. చంపేయండి లేదా ఉరిశిక్ష వేస్తే పీడపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కారు ఎప్పుడు తన చేతికి వస్తుందో తెలియదని, కారు రిపేరు అయ్యేంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని చెప్పారు. ప్రస్తుతం యాగంటికి వెళుతున్నానని, తర్వాత మహానంది, శ్రీశైలం వెళ్లి పూజలు చేస్తానని ఆమె తెలిపారు.

Updated Date - Nov 08 , 2024 | 11:59 PM