Andhra Pradesh: విషవాయువు పీల్చి 35మంది కార్మికులకు అస్వస్థత
ABN, Publish Date - Jun 02 , 2024 | 06:29 AM
విషవాయువులు పీల్చి 35మంది కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం చింతలపాళెం టోల్‌ప్లాజా- రాజులపాళెం మధ్య సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారాన్ని త్వరలో ప్రారంభించేందుకు యంత్రాల పనితీరుపై వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
రేణిగుంట, జూన్ 1 : విషవాయువులు పీల్చి 35మంది కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం చింతలపాళెం టోల్‌ప్లాజా- రాజులపాళెం మధ్య సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారాన్ని త్వరలో ప్రారంభించేందుకు యంత్రాల పనితీరుపై వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కర్మాగారంలో అల్యూమినియం ముక్కలను కరిగించే యంత్రంలో మంట అధికంగా మండించేందుకు ప్లాస్టిక్ ఖాళీ డబ్బాలను ఉపయోగించారు. వరిపైరుకు వాడే మోనోక్రోటోఫాస్ పురుగుమందు డబ్బా నిప్పుల్లో వేయడంతో అది పగిలి అందులో ఉన్న రసాయనాలు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. నిమిషాల వ్యవధిలో రసాయనాల వాసన చుట్టూ వ్యాపించడంతో విధుల్లో ఉన్న కార్మికుల్లో కొంతమంది కళ్లు తిరిగి పడిపోగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ సమీపంలోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు. కోలు కున్న అనంతరం ఇళ్లకు పంపారు.
Updated Date - Jun 02 , 2024 | 06:57 AM