POLICE : 13 మంది పోలీసులు రిటైర్డ్
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:56 PM
జిల్లాలో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్‌ఐలతో కలిపి మొత్తం 13మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. పోలీస్ కాన్ఫరెన్స హాల్‌లో ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గౌతమిశాలి సన్మానం చేశారు. రిటైరైన వారిలో డీఎస్పీ ఆంథోనప్ప, ఎస్‌ఐలు రఫిక్‌సాహెబ్, బలరామరావు, తిప్పయ్యనాయక్, వెంకట లక్ష్మమ్మ, చంద్రశేఖర్, సులోచన, ఏఎ్‌సఐలు పద్మావతి, ఎర్రిస్వామి, దేవదాస్, మారెప్ప, ఎండీ దావూద్, హెడ్‌కానిస్టేబుల్ అల్లీపీరా సాహెబ్ ఉన్నారు. ఈ సందర్భంగా రిటైరైన పోలీసుల ...
అనంతపురం క్రైం,జూలై 1: జిల్లాలో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్‌ఐలతో కలిపి మొత్తం 13మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. పోలీస్ కాన్ఫరెన్స హాల్‌లో ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గౌతమిశాలి సన్మానం చేశారు. రిటైరైన వారిలో డీఎస్పీ ఆంథోనప్ప, ఎస్‌ఐలు రఫిక్‌సాహెబ్, బలరామరావు, తిప్పయ్యనాయక్, వెంకట లక్ష్మమ్మ, చంద్రశేఖర్, సులోచన, ఏఎ్‌సఐలు పద్మావతి, ఎర్రిస్వామి, దేవదాస్, మారెప్ప, ఎండీ దావూద్, హెడ్‌కానిస్టేబుల్ అల్లీపీరా సాహెబ్ ఉన్నారు. ఈ సందర్భంగా రిటైరైన పోలీసుల సేవలను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. ఉద్యోగ విరమణ పొందాక వచ్చే పెన్షన తదితర ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు విజయభాస్కర్‌రెడ్డి,
రామకృష్ణ, ఏఆర్ డీఎస్పీ మునిరాజ, ఎస్బీ సీఐ ఇందిర, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, రాముడు, ఆంజనేయప్రసాద్, ఆర్‌ఎ్‌సఐ వెంకటేశ్వర్లు, సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
ప్రజల ఫిర్యాదుల విషయంలో అలసత్వం చూపకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స హాల్‌లో పబ్లిక్ గ్రీవెన్స రిడ్రెస్సల్‌సిస్టమ్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ 114 ఫిర్యాదులు స్వీకరించారు. పిటిషనర్లతో మాట్లాడారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబసమస్యలు, చీటీల పేరుతో జరిగిన మోసాలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 01 , 2024 | 11:56 PM