ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PINCHAN : పింఛన్లకు రూ.195 కోట్లు

ABN, Publish Date - Jun 28 , 2024 | 12:25 AM

పెంచిన పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు. జిల్లాలో 2,87,032 మంది లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.195.70...

Collector Vinod Kumar in video conference

పింఛన్లకు రూ.195 కోట్లు

రేపు బ్యాంకుల నుంచి డ్రా: కలెక్టర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌/టౌన, జూన 27: పెంచిన పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు. జిల్లాలో 2,87,032 మంది లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.195.70 కోట్లు నిధులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పెంచిన పింఛన సొమ్ము ఒక నెలకు సంబంధించి రూ.125.82 కోట్లు, హామీ మేరకు ఏప్రిల్‌ నుంచి చెల్లించాల్సిన నెలకు రూ.వెయ్యి వంతున బకాయిలు రూ.69.88 కోట్లు ఉన్నాయి. అధికారంలోకి వస్తే పింఛన సొమ్మును రూ.3000 నుంచి


రూ.4000కు పెంచుతామని, ఏప్రిల్‌ నుంచే పెంపును వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. లబ్ధిదారుల హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టామని, శుక్రవారానికి పూర్తవుతుందని సీఎ్‌సకు కలెక్టర్‌ తెలిపారు. ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని, పింఛన అందజేసిన తరువాత అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుంటామని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఇళ్ల వద్దకే..

పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. గుంతకల్లు నియోజకవర్గంలో 16,357 మంది, అనంతపురం అర్బనలో 23,373 మంది, కళ్యాణదుర్గంలో 37,666 మంది, రాప్తాడులో 30,014 మంది, రాయదుర్గంలో 37,978 మంది, శింగనమలలో 44,619 మంది, తాడిపత్రిలో 40,171, ఉరవకొండలో 36,110 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛనలు పంపిణీ చేస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తారని తెలిపారు.


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 12:25 AM

Advertising
Advertising