KALAVA CAMPAIN: ప్రతి బీసీకి రూ.4 వేలు పింఛన
ABN, Publish Date - May 06 , 2024 | 12:14 AM
తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీ వర్గంలోని 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.4 వేలు పింఛన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో కుర్ని సమాజం కులస్థులతో ఆదివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు.
కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, మే 5: తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీ వర్గంలోని 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.4 వేలు పింఛన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో కుర్ని సమాజం కులస్థులతో ఆదివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పథకాల గురించి వివరించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్టు గోవిందరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనన్నారు. ఏ మాత్రం అవగాహన లేని అసమర్థుడు, దద్దమ్మగా ఉండే అతనికి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం గెలిస్తే మహిళలకు రూ.1500 చెల్లిస్తామన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.
కుర్ని సమాజ అధ్యక్షుడు టీడీపీలో చేరిక : వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు కుర్ని సమాజం అధ్యక్షుడు దబ్బడి యోగానంద, మాజీ కౌన్సిలర్ మంజునాథ, పత్రాలు నాగరాజు ఆదివారం టీడీపీలో చేరారు. వీరికి కాలవ శ్రీనివాసులు కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలుగుదేశానికి వార్ వనసైడే : తెలుగుదేశం గెలుపునకు రాయదుర్గంలో వార్ వనసైడ్‌గా ఉందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని 7, 8 వార్డులలో ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్ర చారాన్ని నిర్వహించారు. సూపర్‌సిక్స్ పథకాలను వివరించి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ఏమాత్రం శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ఏకపక్షంగా వ్యవహరించి వైసీపీ కార్యకర్తలకు దోచి పెట్టేందుకు చూపిన శ్రద్ధ, ప్రజా అవసరాలను తీర్చడానికి చూపలేదన్నారు. చాలా మంది ప్రజలు తీవ్రమైన ఆవేదన, ఆవేశంతో ఉన్నారని అన్నారు.
అంతిమ విజయం టీడీపీదే
కణేకల్లు: ఈ ఎన్నికలు ధర్మానికి, అఽధర్మానికి మధ్య జరుగుతున్నాయని, అంతిమ విజయం టీడీపీదేనని కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాల్యంలో కళ్లేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఘనత తమదేనన్నారు. 36వ ప్యాకేజీ కింద హంద్రీనీవా నీటిని తెచ్చేందుకు ఎంతగానో కృషి చేశామని, ఆఖరి నిమిషంలో ఎన్నిక లు రావడంతో వాటికి బ్రేక్ పడిందన్నారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే హంద్రీనీవానీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు.
కుటుంబీకుల ప్రచారం
బొమ్మనహాళ్: వైసీపీ నాయకులకు మరోసారి అవకాశం ఇచ్చి అధికారం కట్టబెడితే ఆంధ్రప్రదేశ రాషా్ట్రన్ని అమ్మేస్తారని కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత అన్నారు. ఆదివారం దర్గాహోన్నూరు, వన్నళ్లి, హొసళ్లి గ్రామాలలో, కూతురు గౌతమి కణేకల్లు మండలం గెణిగెర, అంబాపురం గ్రామాలలో, తండ్రి కాలవ శ్రీనివాసులు గెలుపునకు ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
Updated Date - May 06 , 2024 | 12:14 AM