ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SCHOOL: గొర్రెలు కాస్తున్న బాలుడు.. బడికి..

ABN, Publish Date - Jun 21 , 2024 | 11:59 PM

మండలంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బడిమానేసిన ఇద్దరు పిల్లలను ఎంఈఓ జానరెడ్డెప్ప శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎనుములకొట్టపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, శివమ్మ కుమారుడు గంగరాజు గొర్రెలు కాస్తున్నాడు.

MEO Jana Reddappa talking to Gangaraju's family members

గోరంట్ల, జూన 21: మండలంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బడిమానేసిన ఇద్దరు పిల్లలను ఎంఈఓ జానరెడ్డెప్ప శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎనుములకొట్టపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, శివమ్మ కుమారుడు గంగరాజు గొర్రెలు కాస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ఉదయమే గ్రామానికెళ్లి గంగరాజు, అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. అబ్బాయి చదువుకోవడానికి ఆసక్తికలిగేలా చేస్తూ, విద్య వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు. వారి అంగీకారం మేరకు గంగరాజు వయస్సు రీత్యా గోరంట్లలోని బాలురున్నతపాఠశాలలతో 7వతరగతిలో చేర్పించారు. అదే గ్రామంలో సంధ్య అనే బాలిక బడిమానేసి ఇంటి పనులకే పరిమితం కావడంతో బంధువులతో చర్చించారు. భర్త మరణంతో నారత్నమ్మ కర్ణాటకలోని బాగేపల్లి హాస్టల్‌లో పనిచేస్తూ, కుమారై సంధ్యను అక్కడే పాఠశాలలో చేర్చింది. అనంతరం బడి మానిపిచింది. స్వగ్రామంలో బంధువుల వద్ద ఉంచింది. తిరిగి బాలిన కర్ణాటక బడిలో తల్లివద్ద ఉంటూ విద్యనభ్యసించేలా చేర్పించినట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో సీఆర్పీలు పద్మజ, హరూనబాషా, రవి పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 11:59 PM

Advertising
Advertising