ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

APPS : తగ్గుతున్న యాప్‌ల భారం

ABN, Publish Date - Aug 11 , 2024 | 12:12 AM

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు గత వైసీపీ ప్రభుత్వంలో బోధనే కాకుండా బోధనేతర పనులే ఎక్కువగా నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలపై రోజూ సంబంధిత యాప్‌లలో ఫొటోలు తీసి, ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉండేది. దీని ఉపా ధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనే తర పనుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలు స్తోంది.

Kadiri Girls High School

మరుగుదొడ్ల యాప్‌ తీసేయడంతో

ఉపాధ్యాయుల హర్షం

ఇంకా ఆనలైన వర్క్‌ తగ్గించాలని విన్నపం

కదిరి, ఆగస్టు 10: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు గత వైసీపీ ప్రభుత్వంలో బోధనే కాకుండా బోధనేతర పనులే ఎక్కువగా నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలపై రోజూ సంబంధిత యాప్‌లలో ఫొటోలు తీసి, ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉండేది. దీని ఉపా ధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనే తర పనుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో మొట్టమొదటగా ఉపాధ్యాయుల గౌరవాన్ని తగ్గించేలా మరుగుదొడ్లు ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేసే యాప్‌లను తొలగించింది. దీ నిపై ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మధ్యాహ్న భోజ నం యాప్‌ను, ఆనలైన వర్కును తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

పెరిగిన ఉపాధ్యాయుల గౌరవం

గత ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తికి సంబంధంలేని మరుగుదొడ్ల యాప్‌ను తీసుకొచ్చి, వారిచేత ఫొటోలు ఆప్‌లోడ్‌ చేయించింది. దీన్ని ఉపాధ్యాయులు ఎంతో అవమానకరంగా భావించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులైతే మరు గుదొడ్ల ఫొటోలు తీయడంతోపాటు, ఇతర యాప్‌లతో పనిచేయాల్సి ఉంటుం దని, ఇంత చదివి మరుగుదొడ్లు ఫోటోలు తీస్తున్నారని గ్రామాల్లో పలువురు ఎద్దేవా చేసిన కాలం కూడా ఉంది. మరుగుదొడ్ల ఫొటోలు తీయడానికి గతంలో ఉన్నతపాఠశాలలో రోజుకొక్కరు చొప్పున ఉపాధ్యాయులు వంతులు వేసు కునేవారు. పాఠశాలకు వస్తూనే ప్రధానోపాధ్యాయుడితో పాటు, ఉపాధ్యాయులు చేయాల్సిన మొట్టమొదటి పని మరుగుదొడ్ల ఫొటోలు తీయ డమే. ఇది ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోపే మొదటిసారి మరుగుదొడ్ల ఫొటోలు తీసే పనిని తొలగించి, తమ గౌరవాన్ని పెంచిందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా ఆనలైన భారం ఉంది

గత ప్రభుత్వ హయాం నుంచి ఉపాధ్యాయులు బోధనకన్నా, బోధనేతర పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రధానోపాధ్యాయులైతే రోజంతా యాప్‌ల తోనే కుస్తీ పడుతున్నారు. ఉపాధ్యాయులు ఆనలైన వర్క్‌ తోనే సతమతమవు తుంటారు. విద్యార్థుల చేరిక నుంచి, మార్కుల జాబితాలు ఆప్‌లోడ్‌, విద్యార్థుల పనితీరు, ఇలా రకరకాల వాటితో ఆప్‌లోడ్‌ చేయిస్తూనే ఉంటారు. దీంతో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పడంకంటే సెల్‌ఫోన్ల లో వచ్చిరాని నెట్‌ వర్క్‌తో కుస్తీలు పడుతుంటారు. దీన్ని చూసిన గ్రామీణ ప్రజలు నిత్యం సెల్‌ఫోన్లలోనే ఉంటారని, పాఠాలు చెప్పరని ఉపాధ్యాయులతో ఘర్షణలు పడిన సంఘటనలున్నాయి.


దీన్ని గమనించిన కూటమి నాయకు లు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తొలగిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. ఆ మేరకు ఆనలైన భారం తగ్గితేనే బోధనపై దృ ష్టి పెట్లే అవకాశముంటుందని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారు.

తొలగని మధ్యాహ్నభోజనం యాప్‌

పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం తీ రుపై ఫొటోలు తీసి వాటిని యాప్‌ద్వారా ఆప్‌లోడ్‌ చేయాల్సిన బాధ్యత ప్రధా నోపాధ్యాయులదే. రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు యాప్‌లను నిర్వహిం చాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ చేయాల్సిందేనని, కానీ యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయడం ఇబ్బందిగా ఉందని పలువురు ఉపాధ్యాయు లు అంటు న్నారు. ఈ యాప్‌ల నిర్వాహణకు విద్యాశాఖ మరో యం త్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు. లేకపోతే ఉపాధ్యాయులు బోధనకు కాకుండా యాప్‌ల ఆప్‌లోడ్‌కే సమయం వెచ్చించాల్సి ఉంటుందని వాపోతున్నారు.

మరుగుదొడ్ల యాప్‌ తొలగింపు గౌరవంగా ఉంది

- వెంకటాచలం, ప్రధానోపాధ్యాయుడు, బాలికల ఉన్నత పాఠశాల, కదిరి

ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల ఫొటోలు తీసే యాప్‌ను తొలగించడం గౌరవంగా ఉంది. గతం లో ఉదయం వస్తూనే మరుగుదొడ్ల వద్దకు వెళ్లి ఫొటోలు తీసుకుని ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉండేది. ఇది రోజు ప్రారంభంతో ఉండడంతో ఉపాధ్యా యులకు చికాకుగా, ప్రశాంతత లేకుండా చేసేది. ప్రస్తుత ప్రభుత్వం దానిని తొలగించడం ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవంగా ఉంది.

బోధనేతర పనులన్నీ తొలగించాలి - త్రిమూర్తి, ఏపీటీఎఫ్‌ నాయకుడు

ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల ఫోటో తీసే యాప్‌ తొలగించడం హర్షించ తగ్గవిషయం. అయితే ఆనలైనలో నివేదికలు పంపడం, మధ్యాహ్నభోజన యాప్‌ తదితర బోధనేతర పనులు ఉపాధ్యాయులకు ఇంకా ఉన్నాయి. ఉపాధ్యాయులను వాటికి కూడా దూరంగా ఉంచితే, విద్యార్థులకు బోధన విషయంలో మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉపాధ్యాయులకు ఉంటుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 12:12 AM

Advertising
Advertising
<