crime అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:34 AM
రెండు రోజుల క్రితం అదృశ్యమైన మండలంలోని దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన రాజ ప్ప(32) శుక్రవారం గ్రామ శివారులోని ఓ పొలంలో శవమై కనిపించాడు. ఎస్‌ఐ నబీరసూల్ తెలిపిన మేరకు వివరాలిలా ఉ న్నా యి.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 6: రెండు రోజుల క్రితం అదృశ్యమైన మండలంలోని దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన రాజ ప్ప(32) శుక్రవారం గ్రామ శివారులోని ఓ పొలంలో శవమై కనిపించాడు. ఎస్‌ఐ నబీరసూల్ తెలిపిన మేరకు వివరాలిలా ఉ న్నా యి.
రాజప్ప ఈ నెల 4వ తేదీన తన భార్య లక్ష్మి అదే గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి మందలించాడు. అనంతరం కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత తిరిగి రాలేదు. గ్రామ సమీపంలోని ఓ పొలంలో విగతజీవిగా పడి ఉండగా.. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్తున్న రైతులు గుర్తించారు. వెంటనే అతడి బంధువులకు సమాచారం అందించారు. భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజప్ప మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన సోదరుడు చంద్రహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. మృతుడికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్లు చెప్పారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Sep 07 , 2024 | 12:34 AM