ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POLICE : అబ్బుర పరచిన పోలీసుల మాక్‌డ్రిల్‌

ABN, Publish Date - May 26 , 2024 | 11:43 PM

పట్టణం నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రదేశమది. సాయంత్రంపూట పూలు, కూరగాయలకు వచ్చే జనంతో కిక్కిరిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు భారీగా మోహరించారు. వజ్రా వాహనం, సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌పార్టీ సిబ్బందితో గన్నులు ఎక్కిపెట్టి ఉన్నారు. మరో వైపు నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు అక్కడ ఏంజరుగుతుందో చూసేవారికి అర్థంకాలేదు. అదే సమయంలో మొదట పోలీసు హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఆశ్చర్యంగా వీక్షించిన ప్రజలు

హిందూపురం, మే 26 : పట్టణం నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రదేశమది. సాయంత్రంపూట పూలు, కూరగాయలకు వచ్చే జనంతో కిక్కిరిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు భారీగా మోహరించారు. వజ్రా వాహనం, సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌పార్టీ సిబ్బందితో గన్నులు ఎక్కిపెట్టి ఉన్నారు. మరో వైపు నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు అక్కడ ఏంజరుగుతుందో చూసేవారికి అర్థంకాలేదు. అదే సమయంలో మొదట పోలీసు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి నిరసనకారులు వెళ్లిపో వాలని అనౌన్సమెంట్‌ చేస్తున్నారు. లేకపోతే భాష్పవాయువు ప్రయోగిస్తామని హె చ్చరికలు చేస్తున్నా తగ్గని నిరసనకారులు. పోలీసులపై రాళ్లు విసురుతూ దూ సుకొస్తున్న ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేయాలని ఉన్నతాధి కారులు ఆదేశాలు.


అయినా ముందుకు దూసుకెళ్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరపాలని మైక్‌ లో అనౌన్సమెంట్‌. దీంతో ఒక్కసారిగా పోలీసు వాహనంలోంచి కిందకు దిగి వచ్చి న సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌పార్టీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపారు. అయినా బెదర కుండా పోలీసులవైపు వస్తున్న నిరసన కారుల కాళ్లపై గురిపెట్టి కాల్చారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు స్పందించి అంబులెన్స పిలిపించి, వైద్యుడిని రప్పించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పోలీసు అధికారు లు ఆదేశించడంతో... గాయడిన వ్యక్తిని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. ఇదంతా ఆదివారం సాయంత్రం 5.15గంటల నుంచి 5.35వరకు జరిగింది. అయితే ఆ ప్రాంతంలోని దుకాణదారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం దీనిని ఆసక్తిగా తిలకించారు. అంతా ముగిశాక అసలు విషయం తెలిసింది. వచ్చే నెల 4న ఎన్నికల కౌంటింగ్‌ జరుగనుంది. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఇప్పుడు చూపిన విధంగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఇది తిలకించిన జనం అంతా ఉత్తుత్తేనని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సమస్యా త్మక ప్రాంతాల్లో ఇలాంటి మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 11:44 PM

Advertising
Advertising