ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SC CLASSIFICATION: 30 ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం

ABN, Publish Date - Aug 02 , 2024 | 11:50 PM

ఎస్సీ వర్గీకరణకు పోరాటపటిమతో సాగించిన 30ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం దక్కబోతోందని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్‌ నేతలు హర్షాన్ని వ్యక్తంచేశారు. ఎస్సీల వర్గీకరణకు పచ్చజెండా ఊపుతూ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగుతున్నాయి.

Dandora leaders anointing portraits of Ambedkar and CM

అంబేడ్కర్‌ ఆశయాలతో చంద్రబాబు సామాజిక స్ఫూర్తి

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 2: ఎస్సీ వర్గీకరణకు పోరాటపటిమతో సాగించిన 30ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం దక్కబోతోందని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్‌ నేతలు హర్షాన్ని వ్యక్తంచేశారు. ఎస్సీల వర్గీకరణకు పచ్చజెండా ఊపుతూ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మాదిగ దండోరా ఆధ్వర్యంలో అంబేడ్కర్‌, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేంచేసి స్వీట్లు పంచుకున్నారు. మాదిగ దండోరా రాయలసీమ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బీసీఆర్‌ దాస్‌ మాట్లాడుతూ వెనకబడిన వర్గాలకు సమానావకాశాలు కల్పించేలా రిజర్వేషనను డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ఇదే సామాజిక న్యాయ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో ఉపకులాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాయని తెలిపారు. నాయకులు గిరియప్ప, సంపతకుమార్‌, వెంకటరాముడు, లింగమయ్య, అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 11:50 PM

Advertising
Advertising
<