ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిరుపయోగంగా మార్కెట్‌ యార్డు

ABN, Publish Date - Apr 22 , 2024 | 12:41 AM

రైతులు పండిచే పంటలను స్థానికంగానే విక్రయించుకునేందుకు అనువుగా మడకశిరలోనే మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశారు. దాదాపు 35 ఏళ్ల కిందట మడకశిర పట్టణ సమీపంలో 5.50 ఎకరాల్లో ప్రారం భించారు. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్‌ యార్డు పని చేసింది. అయితే గోదాము లు లేకపోవడం, వ్యాపారులు ముందుకు రాక పోవడంతో యార్డులో వ్యాపార లావా దేవీలు నిలిచిపోయాయి.

A disused market yard in Madakasira

అందని సేవలు

ఇబ్బందులు పడుతున్న

మడకశిర రైతులు

మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 21: రైతులు పండిచే పంటలను స్థానికంగానే విక్రయించుకునేందుకు అనువుగా మడకశిరలోనే మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశారు. దాదాపు 35 ఏళ్ల కిందట మడకశిర పట్టణ సమీపంలో 5.50 ఎకరాల్లో ప్రారం భించారు. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్‌ యార్డు పని చేసింది. అయితే గోదాము లు లేకపోవడం, వ్యాపారులు ముందుకు రాక పోవడంతో యార్డులో వ్యాపార లావా దేవీలు నిలిచిపోయాయి. అయితే రైతులు ధాన్యం నిలువ ఉంచడానికి అప్పటి టీడీపీ పాలనలో యార్డులో గోదాములు నిర్మించారు. దీంతో అప్పట్లో రైతులు ఎంతో సంతో షించారు. కానీ అది ఎక్కువ కాలం నిలువలేదు. తిరిగి యార్డు పనితారు యథాి స్థితి కి చేరింది. లావాదేవీలు నిలిచిపోయాయి.


రైతులకు ఉపయోగం లేకుండా పో యింది. ఇదిలా ఉంటే ఐదేళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతులు తీసు కొచ్చిన పంటలకు మద్దతు ధరలు కల్పించి ప్రభుత్వమే కోనుగోలు చేసే విధంగా మార్కెట్‌ యార్డులను తీర్చిదిద్దినట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అది కేవలం మాట లకే పరిమిత మైంది. వైసీపీ పాలనా కాలం పూర్తి అవుతున్నా స్థానిక మార్కెట్‌యార్డు ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదు. ప్రభుత్వం యార్డుకు పాలక మండలిని ఏర్పాటు చేసింది. నిధుల కొరత కారణంగా మండలి సభ్యులు యార్డును అభివృ ద్ధి చేయలేకపోయారని రైతులు వాపోతున్నారు.


నియోజకవర్గంలో రైతులు అధికంగా చింతపండు, మిరప, మొక్కజొన్న, రాగి, వక్క, మల్బరీ పంటలను పండిస్తున్నారు. మడకశిరలో మార్కెట్‌ యార్డు ఉన్నా అది నిరుపయోగంగా ఉంది. దీంత రైతులు పండించిన పంటలను వ్యయప్రయాసలకు ఓర్చి కర్ణ్ణాటకలోని మార్కెట్‌ యార్డులకు తీసకెళ్తున్నారు. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం యార్డు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, దీంతో తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు వాపోతున్నారు. దీనిపై మార్కెట్‌ యార్డు అధికారి నాగేంద్ర వివరణ ఇస్తూ... యార్డు అభివృద్దికి త్వరలో చర్యలు చేపడుతామని తెలిపారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 12:41 AM

Advertising
Advertising