ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GUMMANURU: దౌర్జన్యం చేస్తే సహించం

ABN, Publish Date - Apr 30 , 2024 | 11:47 PM

రాజకీయంలో దౌర్జన్యం చేస్తే సహించేది లేదు... ప్రజల జోలికి వస్తే తాటతీస్తానని గుంతకల్లు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైసీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డిని హెచ్చరించారు. పట్టణంలోని ఎద్దులపల్లిరోడ్డులో ఉన్న ఓ ఫంక్షన హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన భగీరథ ఉప్పర(సగర) ఆత్మీయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌, డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తి హిమబిందు హాజరయ్యారు.

రామరాజుపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న గుమ్మనూరు జయరాం

వైసీపీ ఎమ్మెల్యేకు జయరాంహెచ్చరిక

పామిడి, ఏప్రిల్‌ 30: రాజకీయంలో దౌర్జన్యం చేస్తే సహించేది లేదు... ప్రజల జోలికి వస్తే తాటతీస్తానని గుంతకల్లు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైసీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డిని హెచ్చరించారు. పట్టణంలోని ఎద్దులపల్లిరోడ్డులో ఉన్న ఓ ఫంక్షన హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన భగీరథ ఉప్పర(సగర) ఆత్మీయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌, డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తి హిమబిందు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కుర్చీ కోసం నువ్వు నేను ఎనీ టైం ఫేస్‌ టు ఫేస్‌ చూసుకుందాం.. ఈ పోరాటంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే తాటతీస్తానని హెచ్చరించారు. నన్ను రెచ్చగొడితే లా అండ్‌ ఆర్డర్‌ కూడా తట్టుకోలేదన్నారు. పామిడి పట్టణంలో భగీరథ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని హితువు పలికారు. మాజీ జడ్పీటీసీ దాసరి లక్ష్మికాంతమ్మ, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, గుత్తి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన ప్రభార్‌ చౌదరి, మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీరా, జింకల సంజీవకుమార్‌, నల్లబోతుల శ్రీనివాసులు, ముసలిరెడ్డి, బొమ్మా మోహనకృష్ణ పాల్గొన్నారు.


టీడీపీతోనే పల్లెల పురోభివృద్ధి: టీడీపీ అధికారంలోకి వస్తేనే పల్లెల పురోభివృద్ధి సాధ్యమని గుమ్మనూరు జయరాం అన్నారు. మండలంలోని రామరాజుపల్లి, ఎదురూరు, అక్కజాంపల్లి, గజరాంపల్లి, పొగరూరు గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచు రఘువీరయ్య ఆచారి, నాగిరెడ్డి, విజయభాస్కర్‌ నాయుడు, మారుతివరప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ మేనిఫెస్టో పేలవం

గుంతకల్లు: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అత్యంత పేలవంగా ఉందని గుమ్మనూరు జయరాం అన్నారు. మంగళవారం రాత్రి బలిజ సంఘ ఆత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జయరాం మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లూ టీడీపీ శ్రేణులు, ప్రజలు అధికార పార్టీ నాయకుల కేసులు, దాడులు, దౌర్జన్యాలతో అవస్థలుపడ్డారని, త్వరలో మంచికాలం రాబోతోందని అన్నారు. అంబికా, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ మాట్లాడుతూ జగన కాపులకు రిజర్వేషన ఇచ్చేదిలేదని తెగేసిచెప్పాడన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో బలిజలకు తగిన ప్రాధాన్యత లభించిందన్నారు. బలిజ సంఘ అధ్యక్షుడు పూల రమణ, కాపు జేసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ, వీ ఏసుదాస్‌, బండారు ఆనంద్‌, కేసీ హరి, ముష్టూరు తిమ్మప్ప, తలారి మస్తానప్ప, హేమాద్రి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.


గుడ్‌మార్నింగ్‌ ప్రోగ్రాం నిర్వహించిన గుమ్మనూర్‌ ఈశ్వర్‌

గుత్తి: టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు ఆధ్వర్యంలో గుడ్‌మార్నింగ్‌ ప్రొగ్రాం నిర్వహించారు. పట్టణంలోని గాంధీ సర్కిల్‌, కోట వీధి, తదితర ప్రాంతాలలో టీ స్టాల్స్‌ వద్ద ఉన్న ఓటర్లను కలసి జయరాంను గెలపించాలని అభ్యర్థించారు. సంపతకుమార్‌, కృష్ణయ్య, సుధాకర్‌నాయుడు, వెంకటేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 11:47 PM

Advertising
Advertising