Accused arrested మోటార్ల చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ABN, Publish Date - Nov 08 , 2024 | 12:52 AM
వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడిని గురువారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్ఐ శివ తెలిపారు. జీడిపల్లి, కాలువపల్లి, కోనంపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల్లో మోటార్లు చోరీకి గురైనట్లు ఇటీవల ఫిర్యాదులు అందాయని, దీంతో విచారణ చేపట్టగా.. కాలువపల్లికి చెందిన అన్వర్‌బాషా వాటిని చోరీ చేసినట్లు తేలింద న్నారు.
బెళుగుప్ప, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడిని గురువారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్ఐ శివ తెలిపారు. జీడిపల్లి, కాలువపల్లి, కోనంపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల్లో మోటార్లు చోరీకి గురైనట్లు ఇటీవల ఫిర్యాదులు అందాయని, దీంతో విచారణ చేపట్టగా.. కాలువపల్లికి చెందిన అన్వర్‌బాషా వాటిని చోరీ చేసినట్లు తేలింద న్నారు.
నిందితుడిని గాలించి మండలంలోని హనిమిరెడ్డి గ్రామ శివార్లలో బ్రహ్మయ్య స్వామి ఆలయం వద్ద అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి రూ.1.90 లక్షలు విలువ చేసే నాలుగు మోటార్లు, ఒక స్టార్టర్, 230 మీటర్ల కేబుల్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఏఎ్‌సఐ రాందాసు, హెడ్ కానిస్టేబుల్ బాల నరసింహులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 08 , 2024 | 12:52 AM