fertilizers ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:55 AM
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాడిపత్రి ఏడీఏ చెంగళరాయుడు హెచ్చరించారు.
యాడికి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాడిపత్రి ఏడీఏ చెంగళరాయుడు హెచ్చరించారు.
మండలకేంద్రంతో పాటు రాయలచెరువు గ్రామంలో శనివారం ఆయన పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను, స్టాక్ గోడౌనలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల వివరాలు ఆనలైనలో, స్టాక్‌రిజిస్టర్‌లో, అలాగే గోడౌనలో సమానంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం షాపు యజమానులు, డీలర్లతో మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసిన వస్తువులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు. ఎరువులు ఎమ్మార్పీకే అమ్మాలని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట ఏఓ మహబూబ్‌బాషా ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 17 , 2024 | 12:56 AM