ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CARDEN SEARCH: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

ABN, Publish Date - May 31 , 2024 | 11:57 PM

ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాజీజానసైదా హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో రౌడీషీటర్‌లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

DSP Bajijana Saida is counseling rowdy sheeters

మడకశిరటౌన, మే 31: ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాజీజానసైదా హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో రౌడీషీటర్‌లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, ఎవరైనా గొడవలు, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా అధికారుల ఆదేశాలు అతిక్రమించినా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించినా ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. సీఐ మనోహర్‌, రాజశేఖర్‌, ఐదు మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.


లేపాక్షి,: ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా మండల వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు డీఎస్పీ కంజక్షన శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషనలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ సందర్భంలో గ్రామాల్లో ఎలాంటి గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌ హెచ్చరికలు బేఖాతరుచేస్తే జిల్లా బహిష్కరణ చేస్తామని ఆయన అన్నారు. ఎస్‌ఐ గోపీ, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


వెంకటగిరిపాళ్యంలో పోలీసు తనిఖీలు

పెనుకొండ: ఎన్నికల కౌంటింగ్‌ దృష్టిలో ఉంచుకుని మండలంలోని వెంకటగిరిపాళ్యం గ్రామంలో పోలీసులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. కియ ఎస్‌ఐ రంగడు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గ్రామంలో కార్డెన సర్చ్‌ చేశారు. అనుమానం ఉన్న ఇళ్లలో, గడ్డివాముల్లో సోదాలు నిర్వహించారు. 4వ తేదీ వరకు గ్రామంలో 144 సెక్షన అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - May 31 , 2024 | 11:57 PM

Advertising
Advertising