ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SP అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: ఎస్పీ

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:59 AM

అసాంఘి క కార్యకలాపాలకు పాల్పడి తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ జగదీష్‌ హెచ్చరించారు. పట్టణంతో పాటు కంబదూరులోని పోలీస్‌ స్టేషన్లను శుక్రవారం తనిఖీ చేశారు.

కళ్యాణదుర్గం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): అసాంఘి క కార్యకలాపాలకు పాల్పడి తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ జగదీష్‌ హెచ్చరించారు. పట్టణంతో పాటు కంబదూరులోని పోలీస్‌ స్టేషన్లను శుక్రవారం తనిఖీ చేశారు.


తొలుత పట్టణ పోలీసు స్టేషనకు వచ్చిన ఆయన అక్కడి సమస్యలను సిబ్బందితో ఆరా తీశారు. అలాగే మండలంలోని గొల్ల గ్రామంలో గ్రామసభ నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. మట్కా, గ్యాంబ్లింగ్‌, గంజాయి, ఆనలైన బెట్టింగ్‌, లోన యాప్‌, సైబర్‌ క్రైమ్‌ వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేశారు. కనుక ఎవరూ వాటి జోలికి వెళ్లరాదని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. గ్రామంలో ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వల్ల దొంగతనాలు అరికట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. తర్వాత కంబదూరు పోలీస్‌ స్టేషనను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, పట్టణ, రూరల్‌ సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 09 , 2024 | 12:59 AM