ELECTION OBSERVER: పొరపాట్లు లేకుండా మార్పులు చేర్పులు
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:25 AM
ఓటరు జాబితా మా ర్పులు, చేర్పుల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతనతో కలిసి కలెక్టరేట్‌లో ఆయన అఽధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు.
ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు
పుట్టపర్తి టౌన, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా మా ర్పులు, చేర్పుల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతనతో కలిసి కలెక్టరేట్‌లో ఆయన అఽధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఈఆర్వోలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, నిబంధనల మేరకు 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వందశాతం ఇంటింటా సర్వే చేపట్టాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి ఫిర్యాదులను ముందుగానే అందించాలని సూచించారు. 2025 జనవరి 1నాటికి ఓటరు నమోదుకు ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, డీఆర్వో విజయసాఽరధి, ఆర్డీవో సువర్ణ, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:25 AM