ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త జిల్లాలో అన్నీ సమస్యలే

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:20 AM

గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం శాపంగా మారింది. అప్పట్లో వైసీపీ పాలకులు పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఆర్భాటంగా ప్రకటించారు. అడ్డదిడ్డంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి, గత పాలకులు వదిలేశారు.

పుట్టపర్తిలోని జిల్లా కార్యాలయాలు

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు భవనాల్లోనే పాలన

పాఠశాలలో డీఈఓ కార్యాలయం

చదువులకు ఆటంకం

పుట్టపర్తి, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం శాపంగా మారింది. అప్పట్లో వైసీపీ పాలకులు పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఆర్భాటంగా ప్రకటించారు. అడ్డదిడ్డంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి, గత పాలకులు వదిలేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. జిల్లా అధికారుల కార్యాలయాలకు సొంత భవనాలు కూడా లేవు. చిన్న చిన్న గదుల్లోనే సర్దుకోవాల్సి వస్తోందని అధికారులు, ఉద్యోగులు వాపోతున్నారు. అధికారులు ఒకరు కూర్చుంటే.. మరొకరు నిలబడాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన చెందుతున్నారు. అవి కూడా సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు భవనాల్లోనే 90 శాతం నిర్వహిస్తున్నారు. జిల్లాకు గుండెలాంటి కలెక్టరేట్‌ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సంగీత కళాశాలలో ఏర్పాటు చేశారు. సత్యసాయి ఎయిర్‌ పోర్టు దగ్గర పర్తిసాయి ధర్మశాలలో ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి దీనజనోద్ధరణ భవనంలో 19 శాఖలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద సత్యసాయి ట్రస్టు భవన సముదాయంలో 12, కొత్తచెరువు, బుక్కపట్నంలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాయాలు మినహా అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస సౌకర్యాల్లేవు. ఓ టేబుల్‌, కుర్చీ వేసుకోవచ్చు. ప్రభుత్వం కేటాయించిన భవనాల్లో ఉండలేక కొన్ని శాఖలు ప్రైవేటు అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసు శాఖకు సంబంధించి సీసీఎస్‌, కమాండ్‌ కంట్రోల్‌, డీటీసీ అనంతపురం నుంచే పనిచేస్తున్నాయి. కొత్త జిల్లాకు కేటాయించిన పోలీసులు, సిబ్బంది ఇబ్బందులు వర్ణనాతీతం. వారిని కొత్త జిల్లా ఏర్పాటు సమయంలో ఎలాగోలా ఒప్పించి, తీసుకొచ్చారు. నేటికీ వసతులు కల్పించకపోగా.. ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్నారు. వసతులు లేక చాలా విభాగాల సిబ్బంది ఉమ్మడి అనంతపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.


చదువులకు ఆటంకం

పాఠశాల అవరణలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదన్న మార్గదర్శకాలను కొత్త జిల్లాలో తుంగలో తొక్కారు. జిల్లా విద్యాశాఖే వాటిని బేఖాతరు చేయడం గమనార్హం. జిల్లా విద్యాశాఖ కార్యాలయం కొత్తచెరువు గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలోని ఎమ్మార్సీ భవనంలో నిర్వహిస్తున్నారు. రోజూ డీఈఓ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం అఽధికారులు, ఉద్యోగులు, టీచర్లు వస్తుంటారు. కార్లు, బైక్‌లలో వస్తుంటారు. వాటి శబ్దాలు, వారి సందడితో విద్యార్థుల చదువులకు ఇబ్బంది ఏర్పడుతోంది. డీఈఓ కార్యాలయం వల్ల తమ పిల్లల చదువులకు అసౌకర్యం ఏర్పడుతున్నట్లు గతంలో కలెక్టర్‌కు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. జిల్లా కార్మిక శాఖ కార్యాలయం కొత్తచెరువు బీసీ కాలనీలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా హాస్టల్‌ విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది.

Updated Date - Dec 02 , 2024 | 12:20 AM