ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MODEL SCHOOL : పెద్దసార్‌ యాడున్నాడో?

ABN, Publish Date - Jul 10 , 2024 | 11:53 PM

వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యాలయాలు ప్రారంభమయ్యి నెల రోజులు దాటింది. అయితే కణేకల్లు మోడల్‌ స్కూల్‌ ప్రినిపాల్‌ మాత్రం అడ్రస్‌ లేకుండా పోయారు. జూనియర్‌ కళాశాలలు జూన ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటి వరకూ ఆయన స్కూల్‌కు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన రాకున్నా వచ్చినట్టు సంతకాలు మాత్రం ఉంటాయి. అటెండెన్స రిజిస్టర్‌లో సైతం ప్రిన్సిపాల్‌ సంతకాలు ఉంటాయి. ...

Model School

అడ్రెస్‌ లేని ప్రిన్సిపాల్‌.....!

కణేకల్లు మోడల్‌ స్కూల్‌లో ఇష్టారాజ్యం

వ్యవహారం చక్కబెడుతున్న సీనియర్‌ పీజీటీ

అనంతపురం విద్య, జూలై 10: వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యాలయాలు ప్రారంభమయ్యి నెల రోజులు దాటింది. అయితే కణేకల్లు మోడల్‌ స్కూల్‌ ప్రినిపాల్‌ మాత్రం అడ్రస్‌ లేకుండా పోయారు. జూనియర్‌ కళాశాలలు జూన ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటి వరకూ ఆయన స్కూల్‌కు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన రాకున్నా వచ్చినట్టు సంతకాలు మాత్రం ఉంటాయి. అటెండెన్స రిజిస్టర్‌లో సైతం ప్రిన్సిపాల్‌ సంతకాలు ఉంటాయి.

స్కూల్‌ మొహం చూడని ప్రిన్సిపాల్‌

కణేకల్లు మోడల్‌ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌ చాలా కాలంగా రావడం లేదు. గతంలో చాలా నెలలు స్కూల్‌లో అందుబాటులో లేడన్న విమర్శలున్నాయి. గత నెల ఒకటో తేదీ నుంచి మోడల్‌ స్కూల్‌లో క్లాసులు ప్రారంభమయ్యాయి. అయినా...ఆయన అడుగు పెట్టలేదు. ఇప్పుడు జూలైలో కూడా 10 రోజులు గడిచిపోయాయి. అయినా ఇప్పటి వరకూ స్కూల్‌ మొహం చూసింది లేదు. కానీ ఆయన జూనలో 11వ తేదీ వరకూ అటెండెన్సలో సంతకాలు చేసినట్టు ఉంది. ఆ


తర్వాత ఆయన ఈ రోజు వరకూ ఎలాంటి సంతకాలు చేయలేదు. ఆయన స్కూల్‌కు రాకున్నా మరో సీనియర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచరే (పీజీటీ) ప్రిన్సిపాల్‌ సంతకాలను 11వ తేదీ వరకూ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం గత నెలన్నరగా మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రిన్సిపాల్‌ అందుబాటులో ఉండాలి. కానీ ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అడ్మిషన్ల కోసం, ఇతర పనులపై స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులు సమాధానం కరువైంది.

షాడో ప్రిన్సిపాల్‌...

స్కూల్‌లో పనిచేసే మరో సీనియర్‌ పీజీటీ అంతా తానై షాడో ప్రిన్సిపాల్‌లా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మోడల్‌ స్కూల్‌లో సుమారు 550 మందికి పైగా విద్యార్థులున్నారు. రెగ్యులర్‌ స్టాఫ్‌ 16 మందితోపాటు మరో 10 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. బాధ్యతగా పనిచేయాల్సిన ప్రిన్సిపాల్‌ అడ్రెస్‌ లేకపోవడంపె అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే సీనియర్‌ పీజీటీనే ప్రిన్సిపాల్‌ మాదిరి సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్టర్‌లో ఫోర్జరీ సంతకాలు చేయడంతోపాటు, కొందరు విద్యార్థుల టీసీలపై కూడా ఆయనే సంతకాలు పెడుతున్నట్లు సమాచారం. స్కూల్‌లో అనేక సమస్యలు న్నా...స్కూల్‌కు రాకుండా ఉన్న ప్రిన్సిపాల్‌కు ఎవరు ఫోన్లు చేసినా...ఎత్తడం లేదని, స్కూల్‌లోని షాడో పీజీటీ ఫోన చేస్తేనే ఎత్తుతారన్న విమర్శలు వస్తున్నాయి. అడ్డగోలుగా వ్యవహరిస్తూ...స్కూల్‌కు రాకుండా విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ పై ఇటు జిల్లా విద్యాశాఖాధికారులు కానీ, అటు ఆర్‌జేడీ కా ర్యాలయ అధికారులు గానీ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 10 , 2024 | 11:53 PM

Advertising
Advertising
<