ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ

ABN, Publish Date - May 25 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. మండలం బిట్‌ కళాశాల, లేపాక్షి మండలం టోల్‌గేట్‌ సమీప గురుకుల పాఠశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్‌రూమ్‌ను వారు శనివారం సాయంత్రం పరిశీలించారు.

హిందూపురం, మే 25: సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. మండలం బిట్‌ కళాశాల, లేపాక్షి మండలం టోల్‌గేట్‌ సమీప గురుకుల పాఠశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్‌రూమ్‌ను వారు శనివారం సాయంత్రం పరిశీలించారు. అక్కడే కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై ఆరాతీశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లన్నీ ఆర్‌ఓలు పర్యవేక్షిస్తున్నారని ఈ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. కౌంటింగ్‌ హాల్‌లోకి సెల్‌ఫోనలు, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులు అనుమతించమన్నారు. గుర్తింపు కార్డు లేకుంటే లోనికి పంపే ప్రసక్తేలేదన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలవద్ద మీడియా పాయింట్‌ ఏర్పాటు చేయాలని సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరి వెంట ఆర్‌ఓలు, రెవెన్యూ, పోలీ్‌సశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:55 PM

Advertising
Advertising