ROAD : కలగానే తారురోడ్డు
ABN , Publish Date - May 26 , 2024 | 11:41 PM
మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కందుకూర్ల పల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారురోడ్డు కలగా మిగిలిపోతుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తరాలు మారినా త ల రాతలు మారని దయనీయ పరిస్థితి ఆ రెండు గ్రామాల వాసులకు నెలకొంది. ఈ రెండు గ్రామాలకు మధ్యన పెన్నానది వెళ్తోంది. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మించి తా రురోడ్డు వేయాల్సి ఉందని, పాలకులు ఎవ రూ పట్టించుకోవడం లేదన్న ఆ రెండు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

దశాబ్దాలు గడిచినా కందుకూర్లపల్లి,
చిన్నకోడిపల్లికి మట్టిరోడ్డే గతి
ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
రొద్దం, మే 26 : మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కందుకూర్ల పల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారురోడ్డు కలగా మిగిలిపోతుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తరాలు మారినా త ల రాతలు మారని దయనీయ పరిస్థితి ఆ రెండు గ్రామాల వాసులకు నెలకొంది. ఈ రెండు గ్రామాలకు మధ్యన పెన్నానది వెళ్తోంది. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మించి తా రురోడ్డు వేయాల్సి ఉందని, పాలకులు ఎవ రూ పట్టించుకోవడం లేదన్న ఆ రెండు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పెన్నా నది అవతలి వైపున చిన్నకోడిపల్లి ఉంది. వర్షాకాలం వస్తే ఇతర ప్రాంతాలకు ఎ టువెళ్లాలో తెలియక దిక్కుతో చని పరిస్థితుల్లో గ్రా మస్థులు ఉంటారు. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల దీయడం తప్ప ఏమీ చేయలేదు. పెన్నానది పరవళ్లు తొక్కితే చిన్నకోడిపల్లికి రాకపోకలు స్తంభి స్తాయి. అనారోగ్య బారినపడిన వ్యక్తుల పరిస్థితి వర్ణనాతీ తం. విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్లలేరు.
టీడీపీలో హయాంలోనే తారురోడ్డు మంజూరు
గత టీడీపీ హయాంలో 2019లో అప్పటి ఎ మ్మెల్యే బీకే పార్థసారథి రొద్దం నుంచి కందుకూర్ల పల్లికి, అటు నుంచి పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం, అలాగే చిన్నకోడిపల్లి, చోళేమర్రి వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ.3కోట్ల నిధులు మంజూరు చేయిం చారు. కందుకూర్లపల్లి వరకు ఎక్స్‌కవేటర్ సాయంతో మట్టి పనులు చేశారు. అయితే ఎన్నికల కోడ్ రావ డంతో పనులు ఆగిపోయాయి.
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
ఆ తరువాత రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లిలు టీడీపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చాయని, రోడ్డు పనులు ఆపేశారన్న వి మర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నోమార్లు ఆయా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే శంకర్ నారాయణకు విన్నవించినా చేస్తామని హామీ ఇచ్చారు తప్ప అమలుకు నోచుకో లేదన్న విమర్శలు ఆయా గ్రామస్థుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మండలకేంద్రమైన రొద్దం నుంచి కందుకూర్లపల్లికి వెళ్లేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండ గా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి 2020లో కంకర తోలించే ప్రయత్నం చేయగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు.
నా తొలి సంతకం కందుకూర్లపల్లి రోడ్డుకే : బీకే
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయకేత నం ఎగురవేస్తుందని, తన తొలి సంతకం కందుకూర్లపల్లి రోడ్డు పనులకే చేస్తానని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆ రెం డు గ్రామాల ప్రజలు ఇప్పటి వరకు తన వెన్నంటి ఉన్నారని అన్నారు. కావున వారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేంతవరకు నిద్రపోనన్నారు. 2019లో తారు రోడ్డు పనులు మంజూరైతే వైసీపీ ప్రభుత్వం రద్దు చేయించిందన్నారు. ఎంపీగా గెలవబోతున్న తాను మొట్టమొదటిగా ఆ గ్రామాలకు రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తానని బీకే హామీ ఇచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....