ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆర్టీసీ బస్టాండులోని దుకాణాలపై దాడులు

ABN, Publish Date - Jun 08 , 2024 | 12:15 AM

స్థానిక ఆర్టీసీ బస్టాండులోని దుకాణాలను తూనికలు, కొలతల శాఖాధి కారులు శుక్రవారం తనిఖీ లు నిర్వహించారు. ఈ దుకాణాల్లో కూల్‌డ్రింక్స్‌, తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ‘అంతా..మోసం’ కథనానికి అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేపట్టారు.

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూన 7: స్థానిక ఆర్టీసీ బస్టాండులోని దుకాణాలను తూనికలు, కొలతల శాఖాధి కారులు శుక్రవారం తనిఖీ లు నిర్వహించారు. ఈ దుకాణాల్లో కూల్‌డ్రింక్స్‌, తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ‘అంతా..మోసం’ కథనానికి అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేపట్టారు. తూనికలు, కొలతలశాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ సుధాకర్‌, ఇన్సపెక్టర్‌ మహమ్మద్‌ గౌస్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహిం చారు.


ఈ దుకాణాలలో కూల్‌డ్రింక్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్లు, తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తుండటాన్ని గుర్తించి షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ ధరలకంటే అదనంగా రూ. 5 లు విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం బస్టాండులోని దుకాణాదారులకు తూనికలు, కొలతల శాఖ చట్టాలపై అవగాహాన కల్పించారు. ఈ తనిఖీలలో సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పి. శ్రీనివాసులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు అక్రమ్‌, మహమ్మద్‌, సిబ్బంది విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:15 AM

Advertising
Advertising