COLLECTOR: ప్రమాదాలను నివారిద్దాం
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:01 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి.. జీవితాలను కాపాడుదామని కలెక్టరు డాక్టర్ వినోద్‌కుమార్ అధికారులతో అన్నారు. కలెక్టరేట్‌లో రోడు ్డప్రమాదాల నివారణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
అనంతపురం టౌన, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి.. జీవితాలను కాపాడుదామని కలెక్టరు డాక్టర్ వినోద్‌కుమార్ అధికారులతో అన్నారు. కలెక్టరేట్‌లో రోడు ్డప్రమాదాల నివారణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల కారణంగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్‌లలో లైటింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్రమం తప్పకుండా హెల్మెట్లు ధరించేవారిని గుర్తించి.. నగదు బహుమతి అందించి అభినందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఇనస్టలేషనకు చర్యలు తీసుకోవాలని నగరపాలిక అధికారులను ఆదేశించారు.
బ్లాక్ స్పాట్‌లలో మళ్లీ ప్రమాదాలు: ఎస్పీ
ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి.. నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అయినా అదే ప్రాంతాల్లో మళ్లీ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ స్పాట్‌లపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులను అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ పరంగా తీసుకుంటున్న చర్యలను ఆర్‌ఎం సుమంత వివరించారు. సమావేశంలో డీటీసీ వీర్రాజు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి, డీసీహెచఎ్‌స డాక్టర్ రవికుమార్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, నేషనల్ హైవే అధికారులు, ట్రాఫిక్ సీఐలు పాల్గొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 12:01 AM