ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GOD : త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN, Publish Date - Jun 18 , 2024 | 12:25 AM

త్యాగనిరతికి, దాన గుణానికి ప్రతీక బక్రీద్‌ పండుగ జామియా మసీదు మౌలానా అబ్దూల్‌ మన్నాన, ముతు వల్లి నూరుల్లా ఖాన, కోశాధికారి సిరాజ్‌ పేర్కొన్నారు. బక్రీద్‌ పర్వదినాన్ని సోమవారం పట్టణ పరిధిలోని అల్‌హిలాల్‌ పాఠశాల ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్‌ శుభాకాం క్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మౌలానా బక్రీద్‌ విశిష్టతను వివరించారు.

Muslims praying at Eidgah in Gorantlo

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

త్యాగనిరతికి, దాన గుణానికి ప్రతీక బక్రీద్‌ పండుగ జామియా మసీదు మౌలానా అబ్దూల్‌ మన్నాన, ముతు వల్లి నూరుల్లా ఖాన, కోశాధికారి సిరాజ్‌ పేర్కొన్నారు. బక్రీద్‌ పర్వదినాన్ని సోమవారం పట్టణ పరిధిలోని అల్‌హిలాల్‌ పాఠశాల ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్‌ శుభాకాం క్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మౌలానా బక్రీద్‌ విశిష్టతను వివరించారు. ప్రార్థనల్లో టీడీపీ నాయకులు పాల్గొని ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. పెనుకొండ మండలంలోని గుట్టూరు, నాగలూరు, తిమ్మాపురం, శెట్టిపల్లి తదితర గామ్రాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జురుపుకున్నారు. ఉదయం ఈద్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అలాగే సోమందేసల్లి మండలాల్లో పెద్ద ఎత్తున పండుగను జరుపుకున్నారు. ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. గోరంట్ల: మండలకేంద్రంలో ముస్లింలు ప్రార్థన మందిరాల నుంచి గో రంట్ల ప్రధాన రహదారిపై ర్యాలీగా ఈద్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


దేవుడికి కుర్బానీ ఇచ్చి, స్నేహితులతో కలిసి విందు భోజనాలు చేశారు. బక్రీద్‌ వేడుకలను మడకశిర వ్యాప్తంగా ఘ నంగా జరుపుకొన్నారు. పట్టణంలో ఉదయం ర్యాలీగా ఈద్గా మైదానానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదుల్లోనూ ప్రార్థనలు చేశారు. అలాగే ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వా మి సమక్షంలో బక్రీద్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్‌.అండ్‌బీ అతిథి గృహంలో కేక్‌కట్‌చేసి ముస్లిం లకు స్వీట్లను పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి తదతరులు పాల్గొన్నారు. అలాగే అగళి మం డలకేంద్రంలో బక్రీద్‌ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పావగడ తాలుకా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పావగడలోని రొప్పం నుంచి ర్యాలీగా ఈద్గా మైదానం చేరుకుని సాముహిక పార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకుని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే వైఎన హొసకోటలోని ఈద్గామైదానంలో బక్రీద్‌ వేడుకలను నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2024 | 12:25 AM

Advertising
Advertising