ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP LEADER: అక్రమాలకు పెద్దన్న

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:11 AM

రాష్ట్రంలో ఆయన పార్టీ అధికారం కోల్పోయినా ఇక్కడ ఆయన హవా ఎంత మాత్రం తగ్గలేదు. ఆయన చెప్పిందే వేదం. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆయన ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. ఆయన ఉంటున్న కాలనీలో అంత తన ఇష్టానుసారమే జరిగింది.

పది సెంట్ల స్థలం ఆక్రమణ

ఆరు సెంట్లలో ఇంటి నిర్మాణం

లెక్కలేనన్ని ఇతరుల ప్లాట్ల అమ్మకం

మటన మార్కెట్‌లో ఇష్టారాజ్యం

అతను వైసీపీ నాయకుడు. రాష్ట్రంలో ఆయన పార్టీ అధికారం కోల్పోయినా ఇక్కడ ఆయన హవా ఎంత మాత్రం తగ్గలేదు. ఆయన చెప్పిందే వేదం. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆయన ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. ఆయన ఉంటున్న కాలనీలో అంత తన ఇష్టానుసారమే జరిగింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి, అమ్మేశాడు. ఇటీవల కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఆయన కొంతమంది చోటా నాయకులతో కలిసి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యుడిని కలిశాడు. దీంతో ఆయన హవా ఎప్పటిలానే సాగుతోంది. ఇది చూసిన వారంతా అప్పుడు.. ఇప్పుడు ఆయనదే హవా అనేస్తున్నారు. ఇదంతా జరుగుతోంది మరెక్కడో కాదు..రూరల్‌ మండలంలోని చిన్నంపల్లి పంచాయతీ పరిధిలోని మటన మార్కెట్‌లోనే. - అనంతపురం రూరల్‌ (ఆంధ్రజ్యోతి)

ఆక్రమించి.. ఇల్లు కట్టేసి..

ఆ వైసీపీ నాయకుడు మటన మార్కెట్‌లోకి వచ్చినప్పుడు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. స్థానికంగా బాడుగ ఇంట్లో ఉంటూ పనులు చేసుకునేవాడు. అయితే అప్పటి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల అండతో నాయకుడి అవతారం ఎత్తాడు. స్థానికులను బెదిరించాడు. టీడీపీ, ఇతరులకు కేటాయించిన స్థలాలను ఒక్కొక్కటిగా ఆక్రమించేశాడు. అలా పది సెంట్లు ఆక్రమించేశాడు. అందులోని ఆరు సెంట్లలో అన్ని హంగులతో పెద్ద ఇంటిని కూడా నిర్మించాడు. స్థానికంగా ఇతరులకు కేటాయించిన స్థలాలు ఒక్కొక్కటిగా అమ్మేశాడు. ఇలా అమ్మిన ప్లాట్ల సంఖ్య పెద్దది గానే ఉంది. ఒక్కో ఖాళీ స్థలాన్ని రూ.లక్ష మొదలుకుని రూ.3లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఆ సొమ్మునే ఇంటి నిర్మాణానికి పెట్టుబడి పెట్టాడు. స్థానికంగా ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలన్నా ఆయన అనుమతి తీసుకోవడంతోపాటు, మామూళ్లు ఇచ్చుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తరువాతైనా స్థానికంగా పరిస్థితి మారుతుందని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం మారింది. అయినా ఆ నాయకుడి హవా మాత్రం తగ్గకపోవడంతో నిర్వేదం చెందుతున్నారు.


పట్టించుకోని రెవెన్యూ అధికారులు

ఇతరులకు సంబంధించి ప్లాట్లను ఇష్టారాజ్యంగా విక్రయించి సొమ్ము చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోని పరిస్థితి. అటూ వైపు తొంగిచూసిన దాఖలాలే లేవు. దీనికి తోడు అప్పటి రెవెన్యూ ఉద్యోగులు ఆ నాయకుడికి బాగా సహకరించినట్లు సమాచారం. సాధారణంగా ఎవరికైనా సెంటు భూమి ఇవ్వాలంటే రెవెన్యూ అధికారులకు సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. అలాంటిది పది సెంట్లు ఇతరులకు ప్రభుత్వం కేటాయించగా ఆ స్థలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా పట్టించుకోవడం లేదు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ నాయకుడి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది అనుకుంటే లోపాయికారిగా అధికార పార్టీ నాయకుల అభయం పొంది యథావిధిగా తన పని చేసుకుపోతున్నట్లు సమాచారం.

నిబంధనలు అందరికీ ఒక్కటే..

రెవెన్యూ నిబంధనలు అందరికి ఒక్కటే. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండవు. వైసీపీ నాయకుడు ఆరు సెంట్లలో ఇల్లు కట్టుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాం. భూ ఆక్రమణ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తోంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.

- మోహనకుమార్‌, తహసీల్దార్‌

Updated Date - Nov 09 , 2024 | 12:11 AM