పింఛన సొమ్ముతో వైసీపీ నేతలకు బిల్లులు
ABN, Publish Date - Apr 03 , 2024 | 12:04 AM
వైసీపీ బడానేతలకు బిల్లులు మంజూరు చేయడం వల్ల ఖజానా ఖాళీ అవడంతో ఈ నెల పింఛన్ల పంపిణీలో జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
పెనుకొండ రూరల్, ఏప్రిల్ 2 : వైసీపీ బడానేతలకు బిల్లులు మంజూరు చేయడం వల్ల ఖజానా ఖాళీ అవడంతో ఈ నెల పింఛన్ల పంపిణీలో జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. పింఛన్ల పంపిణీలో జాప్యానికి టీడీపీ పై నెపం నెట్టడం తగదని ఆమె అన్నారు. పెనుకొండ నగర పంచాయతీ లోని కోనాపురం, మంగాపురం, ఇస్లాపురం, కొండాపురం, తిమ్మాపురం, వెంకట రెడ్డిపల్లి ల్లో టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారథి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత జనసేన, టీడీపీ నాయకులతో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరు గుతూ సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సవిత మాట్లాడుతూ... వైసీపీ నేతల బిల్లుల కోసం పింఛన్ల సొ మ్ము కొల్లగొట్టిన ప్రభుత్వమని ఎద్దేవ చేశారు. టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజ ర్వాయర్ నుంచి పెనుకొండ చుట్టుప క్కల గ్రామాకు నీరందించామన్నారు. కానీ వైసీపీ ఐదేళ్లపాలనలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం బాగు పడాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కోనాపురానికి రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని గ్రామస్థుల కు హామీఇచ్చారు. మాజీ ఎంపీపీ కేశవయ్య, మునిమడుగు చిన్నవెంకట రాము డు, శ్రీరాములు యాదవ్, శోబనగిరి, గీత, హనుమంతు, నారాయణస్వామి, రామ లింగ, లక్ష్మీనారాయణరెడ్డి, గోపాల్‌నాయుడు, మిలిటరీ నారాయణప్ప, నారాయణ నాయక్, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, విజయ్‌క్రిష్ణ, చైతన్య, హరినారాయణ చౌదరి, పెద్దన్న, కొల్లప్ప, సూర్యనారాయణ, జనసేన సమన్వయకర్త ఈడిగ కుమార్, రమేష్‌నాయుడు, తెలుగు మహిళలు చంద్రకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి
పెనుకొండ టౌన : రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో టీడీపీ, జనసేన నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛలేదని, అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేసి, కేసులు పెడుతున్నారన్నారు. దళితులపై లెక్కలేనన్ని కేసులుపె ట్టారని, పలువురు హత్యకు గురయ్యారన్నారు.
Updated Date - Apr 03 , 2024 | 12:04 AM