AMILINENI: బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటా
ABN, Publish Date - May 06 , 2024 | 11:29 PM
బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని తూముకుంట, బెస్తరపల్లి, మందలపల్లి, కెంచంపల్లి, కలిగులిమి, అప్పాజీపాలెం, కొలిమిపాలెం. జంబగుంపల తదితర గ్రామాల్లో సోమవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలలతో ఘన స్వాగతం పలికారు.
రోడ్‌షోలో అమిలినేని సురేంద్రబాబు
కుందుర్పి, మే 6: బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని తూముకుంట, బెస్తరపల్లి, మందలపల్లి, కెంచంపల్లి, కలిగులిమి, అప్పాజీపాలెం, కొలిమిపాలెం. జంబగుంపల తదితర గ్రామాల్లో సోమవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలలతో ఘన స్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే కళ్యాణదుర్గం జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులు ఆలస్యం అయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే చంద్రబాబును ఒప్పించి కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో రోడ్లు వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. సూపర్‌సిక్స్ పథకాల ద్వారా ఇంటింటికి కుళాయి వేయించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహనరెడ్డి ప్రయత్నిస్తున్నారని, మన పాసు పుస్తకాలపై ఆయన ఫొటో వేసుకోవడం, రిజిస్ట్రేషన చేయించుకునే భూములకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తాడంటే మనకు ఏమీ హక్కులు లేకుండా పోతాయన్నారు.
బీటీపీ కాలువ, కుందుర్పి బ్రాంచ కెనాల్ పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేసి సాగు, తాగునీరిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పరిశ్రమల కోసం తిమ్మసముద్రం ప్రాంతంలో ఉన్న భూమిలో విద్యుత, నీరు, రోడ్లు వేయగలిగితే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఒక్క చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. నిరుద్యోగ యువకులు చంద్రబాబుకు జై కొడుతూ టీడీపీ రావాలని కోరుకుంటున్నారన్నారు. మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశగా మారే రోజులు దగ్గరలోనే వున్నాయన్నారు. ప్రతి గ్రామంలో నిర్వహించే రోడ్‌షోకు ప్రజలు అశేషంగా తరలివస్తున్నారంటే టీడీపీపై ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 13వ తేదీన ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
మండల కన్వీనర్ ధనుంజయ, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున, మాజీ ఎంపీపీ దీనమ్మ, మాజీ కన్వీనర్ కర్తనపర్తి రామాంజనేయులు, మాజీ సర్పంచ రవి, రామాంజనేయులు, రాఘవేంద్రబాబు, చిత్రలింగప్ప, కన్వీనర్లు శ్రీనివాసులు, బాబు, తిప్పేస్వామి, గిద్దప్ప, ఆనంద్, మల్లికార్జున, కేఎల్ ప్రసాద్, నాయకులు పాలాక్షి, అంగడి రామాంజనేయులు, విరుపాక్షి, సంజీవప్ప, శివలింగప్ప, ఓబయ్య, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
అభివృద్ధికి సంకేతం టీడీపీ
కళ్యాణదుర్గం రూరల్: అభివృద్ధికి సంకేతం తెలుగుదేశం పార్టీ అని ఐఎస్‌ఐవీ వ్యవస్థాపకుడు టీపీ రామన్న అన్నారు. సోమవారం కంబదూరు మండలంలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తరపున ప్రచారం నిర్వహించారు.
Updated Date - May 06 , 2024 | 11:29 PM