ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New dealers : బఫర్‌ సంకటం!

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:46 PM

అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో రేషన షాప్‌ నంబర్‌ 1225055 ఉంది. ప్రతి నెలా ఈ దుకాణానికి 90 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. కానీ ఆగస్టుకు సంబంధించి ఆ డీలర్‌కు 22 క్వింటాళ్లు మాత్రమే సరఫరా కానున్నాయి. అక్కడ 67 క్వింటాళ్ల బఫర్‌ స్టాక్‌ ఉన్నట్లు చూపడమే దీనికి కారణం. వైసీపీ వర్గీయుడైన ఆ డీలర్‌ 67 క్వింటాళ్లకుపైగా బఫర్‌ చూపించారు. దీంతో ఆ లోటును ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక కొత్తగా డీలర్‌షిప్‌ దక్కించుకున్న వ్యక్తి సతమతమవుతున్నారు. ఇదే ప్రాంతంలోని షాపు నంబరు 1225042లో సుమారు 38 క్వింటాళ్ల కొరత ఉంది. పాపంపేట ప్రాంతంలో ఏడు రేషన దుకాణాలు ....

Distribution of rice in Bommanhal Mandal Sridharaghatta

కొత్త డీలర్లకు కొరత గుబులు

ఆగస్టు కోటా బియ్యంలో భారీగా కోత..?

కనీసం 10.. ఆపై వంద క్వింటాళ్ల దాకా..

వైసీపీ డీలర్లు బఫర్‌ చూపడమే కారణం

- అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో రేషన షాప్‌ నంబర్‌ 1225055 ఉంది. ప్రతి నెలా ఈ దుకాణానికి 90 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. కానీ ఆగస్టుకు సంబంధించి ఆ డీలర్‌కు 22 క్వింటాళ్లు మాత్రమే సరఫరా కానున్నాయి. అక్కడ 67 క్వింటాళ్ల బఫర్‌ స్టాక్‌ ఉన్నట్లు చూపడమే దీనికి కారణం. వైసీపీ వర్గీయుడైన ఆ డీలర్‌ 67 క్వింటాళ్లకుపైగా బఫర్‌ చూపించారు. దీంతో ఆ లోటును ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక కొత్తగా డీలర్‌షిప్‌ దక్కించుకున్న వ్యక్తి సతమతమవుతున్నారు. ఇదే ప్రాంతంలోని షాపు నంబరు 1225042లో సుమారు 38 క్వింటాళ్ల కొరత ఉంది. పాపంపేట ప్రాంతంలో ఏడు రేషన దుకాణాలు ఉండగా.. ఐదింటిలో బఫర్‌ స్టాక్‌ చూపుతున్నాయి.

- అనంతపురం నగరంలోని 33వ రేషన దుకాణంలో 130 క్వింటాళ్లకుపైగా బఫర్‌ పెట్టారు. దుకాణం నంబర్‌ 101లో 110 క్వింటాళ్లకు పైగా బఫర్‌ ఉంది. అనంతపురం నగరం, రూరల్‌ ప్రాంతాల్లోని అత్యధిక రేషన దుకాణాలలో కనీసం 10 క్వింటాళ్ల బఫర్‌ చూపుతున్నారు. దీంతో ఆగస్టు నెలలో రేషన పంపిణీ డీలర్లకు సంకటంగా మారింది. తక్కువ స్టాకును కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలని వారు వాపోతున్నారు.

- రాప్తాడు మండలంలో మొత్తం 32 రేషన దుకాణాలు ఉన్నాయి. ఇందులో వంద క్వింటాళ్లకు పైగా బఫర్‌ చూపుతున్నారు. బండమీదపల్లిలోని ఓ రేషన దుకాణంలో 32 క్వింటాళ్లు, మరో దుకాణంలో 18 క్వింటాళ్లు, ఎర్రగుంటలోని ఓ దుకాణంలో 22 క్వింటాళ్ల బయ్యం బఫర్‌ స్టార్‌ ఉన్నట్లు చూపుతున్నారు. కొత్త డీలర్లు ఈ కొరతను ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. పాత డీలర్ల నుంచి బఫర్‌ స్టాక్‌ను రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.


- బొమ్మనహాళ్‌ మండలంలోని 39 రేషన దుకాణాలలో 502.72 క్వింటాళ్ల బియ్యం బఫర్‌ స్టాక్‌ ఉన్నట్లు చూపుతున్నారు. ఈ మొత్తం ఆగస్టులో కోత పెడతారని కొత్త డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

అనంతపురం రూరల్‌, జూలై 25: ప్రభుత్వం మారగానే మొదట మారేది రేషన దుకాణాల డీలర్లే..! ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ మద్దతుదారులు రేషన దుకాణాలను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పలువురు డీలర్లు మారారు. డీలర్‌షిప్‌ దక్కించుకునేందుకు పోటీ తీవ్రస్థాయిలో నడిచింది. అవకాశం చిక్కించుకున్నవారు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మొదటి నెలలోనే వారికి ‘బఫర్‌ స్టాక్‌’ సినిమా కనిపిస్తోంది. ఆగస్టు నెలలో పంపిణీ చేయాల్సిన కోటాలో భారీగా కోత పడుతోంది. ఆనలైన రికార్డుల ప్రకారం జిల్లాలోని మెజార్టీ రేషన దుకాణాల్లో ‘బియ్యం మిగులు’ చూపుతోంది. అదిపోనూ మిగిలిన కోటాను మాత్రమే పౌరసరఫరాల శాఖ డీలర్లకు పంపేందుకు సిద్ధమైంది. ఆనలైనలో ఉన్న మిగులు నిల్వలు రేషన దుఖాణాలలో వాస్తవంగాలేవు. దీంతో తక్కువ బియ్యాన్ని కార్డుదారులకు ఎలా సర్దాలో తెలియక కొత్త డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.

పది క్వింటాళ్లకు పైగానే...

అనంతపురం జిల్లా కేంద్రం, అనంతపురం రూరల్‌ మండలంలో 132 రేషన దుకాణాలు ఉన్నాయి. అనంతపురం అర్బన పరిధిలో 55, రూరల్‌ మండలం పరిధిలో 77 దుకాణాలు ఉన్నాయి. గత నెల వరకూ వైసీపీ నాయకులు డీలర్లు వ్యవహరించారు. కార్డుదారులకు రేషన పంపిణీ చేశారు. ప్రభుత్వం మారడంతో రేషన దుకాణాలు టీడీపీ వారికి వచ్చాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. వైసీపీ నాయకులు పోతూ పోతూ బఫర్‌ స్టాకును చూపించారు. ఒక్కొక్క షాపులో కనీసం పది క్వింటాళ్లకు పైగా బఫర్‌ స్టాక్‌ ఉన్నట్లు సమాచారం. మరికొన్నింటిలో 50 నుంచి వంద క్వింటాళ్లకు బఫర్‌ స్టాక్‌ ఉంది. అనంతపురం అర్బన పరిధిలోని 55 రేషన దుకాణాలలో ఒకటి మినహా.. మిగిలిన అన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకింది. రూరల్‌ మండలం పరిధిలోను ఇదే పరిస్థితి. బియ్యం ఒక్కటే కాదు.. జొన్నలు, రాగులు తదితర సరుకులు కూడా బఫర్‌ స్టాక్‌ ఉన్నట్లు చూపిస్తున్నారు.

కేటాయింపుల్లో కోత..

బఫర్‌ స్టాక్‌ వివరాలను చూసి కొత్త డీలర్లు ఆందోళన చెందుతున్నారు. బఫర్‌ స్టాక్‌ కారణంగా ఆగస్టు కేటాయింపుల్లో కోత పెడుతున్నారు. పాత నిల్వలు పోనూ.. మిగిలిన స్టాక్‌ను మాత్రమే అధికారులు సరఫరా చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. రేషన పంపిణీలో కొత్త డీలర్లకు తిప్పలు తప్పవు. ఈ ప్రభావం కార్డుదారులపై పడుతుంది. వారికి అరకొరగా రేషన దక్కే అవకాశం ఉంది. బఫర్‌ స్టాక్‌ ఉన్న వైసీపీ డీలర్లపై అధికారులు కేసులు పెట్టారు. కానీ రికవరీ ఎలా చేస్తారనేదానికి అధికారుల వద్ద సమాధానం లేదు. బఫర్‌ జీరో చేస్తే కొత్త డీలర్ల సమస్య పరిష్కరం అవుతుంది. కార్డుదారులకు పూర్తిస్థాయిలో రేషన దక్కుతుంది. ఈ విషయంపై అనంతపురం రూరల్‌ మండలం సీఎ్‌సడీటీ వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.

మొత్తం బియ్యం ఇవ్వాలి..

నాకు కేటాయించిన రేషన దుకాణం పరిధిలో 613 కార్డులు ఉన్నాయి. వీటికి 73 క్వింటాళ్లకుపైగా రేషన బియ్యం సరఫరా చేయాలి. బఫర్‌ 38 క్వింటాళ్లు చూపుతోంది. బఫర్‌ ఫోనూ.. మిగిలిన బియ్యం సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా రేషనకార్డులు ఎన్ని ఉంటే.. అన్నింటికీ సరిపడా నిల్వలను సరఫరా చేయాలి.

-బాబావలి, డీలర్‌, పాపంపేట

అన్నింట్లో బఫర్‌ ఉన్నాయి..

ప్రతి రేషన దుకాణంలో బఫర్స్‌ ఉన్నాయి. నాకు కేటాయించిన దుకాణంలో 90 క్వింటాళ్లకుగానూ 68 క్వింటాళ్ల బియ్యం బఫర్‌ ఉంది. అది కోత పెడితే ఆగస్టు నెలకు కేవలం 22 క్వింటాళ్ల బియ్యం వస్తుంది. ఆ బియాన్ని మాత్రమే సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు. బియ్యం ఒక్కటే కాదు. సంచులు, చక్కెర, జొన్నలు.. ఇలా అన్నింటి బఫర్‌ చూపుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి.

-జెట్టి భరత, డీలర్‌, బసవతారక నగర్‌

క్లియర్‌ చేయాలి..

ఐదారు క్వింటాళ్ల బఫర్‌ ఉంటే.. కార్డుదారులకు సర్దిచెప్పి రేషన వేయవచ్చు. కానీ యాభై.. వంద క్వింటాళ్ల బఫర్‌ ఉన్నాయి. అంత కొరత ఉంటే సర్దుబాటు చేయడం కష్టం. అధికారులు బఫర్స్‌ పూర్తిగా క్లియర్‌ చేస్తే బాగుంటుంది.

-సాంబశివ, డీలర్‌, విద్యారణ్యనగర్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 25 , 2024 | 11:47 PM

Advertising
Advertising
<