రైల్వే అవినీతిపై సీబీఐ వల
ABN, Publish Date - Jul 04 , 2024 | 11:41 PM
అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజనల్ రైల్వే కార్యాలయంలో అవినీతి చేపలు సీబీఐ వలకు చిక్కాయి. కార్యాలయంలోని అకౌంట్స్ సెక్షనలో అవినీతికి పాల్పడిన అధికారులను గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
ఫ గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలో రాత్రిదాకా విచారణ
గుంతకల్లు, జూలై 4: అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజనల్ రైల్వే కార్యాలయంలో అవినీతి చేపలు సీబీఐ వలకు చిక్కాయి. కార్యాలయంలోని అకౌంట్స్ సెక్షనలో అవినీతికి పాల్పడిన అధికారులను గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు, గుంతకల్లు రైల్వే డివిజనలోని కడప వద్ద రైల్వేవంతెన నిర్మాణ పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టరును రైల్వే ఆకౌంట్సు శాఖ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. ఈ పనులకు ఆనలైన టెండర్లు నిర్వహించగా, కడపకు చెందిన ఓ కాంట్రాక్టరు ప్రైజ్డ్ బిడ్డర్ అయ్యారు. పనికి సంబంధించి ఆక్సెప్టెన్సీ లెటరును జారీ చేయడానికి సీనియర్ డివిజనల్ ఫైనాన్స మేనేజరు (సీనియర్ డీఎ్‌ఫఎం) కె.ప్రదీప్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంటు బాలాజీ, ఇతర సిబ్బంది పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. సాధారణంగా ఇచ్చే డబ్బుకన్నా ఎక్కువ అడగటంతో సంబంధిత కాంట్రాక్టరు సీబీఐ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు గురువారం సాయంత్రం లంచం డబ్బును ఓ ఉద్యోగికి ఇచ్చాడు. అదే సమయంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ అవినీతిలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ బాలాజీతోపాటు మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులో తీసుకున్నారు. సీనియర్ డీఎ్‌ఫఎం ప్రదీప్ బాబు రైల్వే ఇనస్టిట్యూట్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమంలో ఉన్నారని తెలిసి.. అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను డీఆర్‌ఎం కార్యాలయానికి తీసుకువచ్చారు. డీఆర్‌ఎం వినీత సింగ్ జోనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో ఉండగా, అత్యవసరంగా పిలిపించి విషయాన్ని తెలియజేశారు. గుంతకల్లు వనటౌన పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. ఆ తర్వాత డీఆర్‌ఎం సమక్షంలో అకౌంట్స్ శాఖ సిబ్బందిని మీటింగ్ హాల్‌కు రప్పించి, నిందితులను విచారించారు. సీనియర్ డీఎ్‌ఫఎం ఇంటికి రాత్రి 7 గంటల సమయంలో కొందరు సీబీఐ అధికారులు వెళ్లి, ఆయన సతీమణి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిని సోదా చేసేందుకు ఇతర అధికారుల కోసం వేచి ఉన్నారు. డీఆర్‌ఎం కార్యాలయంలో సీబీఐ అధికారులు రాత్రి తొమ్మిది గంటల వరకూ విచారించారు. ఆ తర్వాత రిపోర్టు రాసే పనిలో పడ్డారు.
Updated Date - Jul 04 , 2024 | 11:41 PM