GODDESS : శాకంబరిగా చౌడేశ్వరీదేవి
ABN, Publish Date - Aug 04 , 2024 | 12:13 AM
పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీ లో వెలసిన చౌడేశ్వరీదేవి శని వారం శాకంబరీదేవి అలంక రణలో భక్తులకు దర్శనమిచ్చా రు. ఆషాఢ మాసాన్ని పురస్క రించుకుని ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు, పూ జలు చేశారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసా దాలను అందజేశారు.
ఉరవకొండ, ఆగస్టు3: పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీ లో వెలసిన చౌడేశ్వరీదేవి శని వారం శాకంబరీదేవి అలంక రణలో భక్తులకు దర్శనమిచ్చా రు. ఆషాఢ మాసాన్ని పురస్క రించుకుని ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు, పూ జలు చేశారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసా దాలను అందజేశారు.
నేడు చౌడేశ్వరీ జయంత్యుత్సవాలు
పట్టణంలోని చౌడేశ్వరి, ఉర గాద్రిచౌడేశ్వరీ దేవి, పురమాన కట్ట చౌడేశ్వరీదేవి ఆలయాల్లో ఆదివారం అమ్మవారి జయం త్యుత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయా ఆలయకమిటీల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి సామూహిక క్షీరాభిషేకం, బోనాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
రాయదుర్గం రూరల్ : రాయదుర్గం పట్టణంలోని నేసేపేటలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయంలో ఆదివారం అమ్మవారి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త గట్టు శ్రీరాములు శనివారం తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిమాలు కృష ్ణమూర్తి, తొగట వీరక్షత్రియ సంఘం అధ్యక్షుడు మద్దిలేటి ప్రభాకర్‌తో కలిసి ఆయన శనివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన అనంతరం ఒడిబియ్యం కట్టే కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం తొగట వీరక్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేతులు మీదుగా అందించనున్నట్లు తెలిపారు. సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ ఉంటుందని, భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 04 , 2024 | 12:13 AM